Movie News

దురంధర్ హీరోకి విచిత్రమైన పరిస్థితి

బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత ఏం సినిమా చేస్తాడనే దాని మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. డాన్ 3 వార్తలు ఏడాది కాలంగా చక్కర్లు కొడుతున్నాయి కానీ నిజంగా తెరకెక్కుతుందా లేదానే అనుమానాలు ఇంకా వీడలేదు.

బడ్జెట్ ఇష్యూస్ వల్లే ఆపేశారని, కానీ ఇప్పుడు రణ్వీర్ మార్కెట్ పెరిగింది కాబట్టి తిరిగి పట్టాలు ఎక్కొచ్చని అంటున్నారు. కానీ అది జరిగేలా లేదు. దీనికన్నా ముందు శక్తిమాన్ సిరీస్ ని ఒక ప్యాన్ ఇండియా మూవీగా తీయాలనే ప్లాన్  ప్రాధమిక దశలోనే ఆగిపోయిందట. వర్కౌట్ కాదని భావించి పక్కన పెట్టారని అంటున్నారు.

ప్రశాంత్ వర్మతో ప్లాన్ చేసుకున్న బ్రహ్మరాక్షస్ కూడా అంతా ఓకే అనుకున్నాక సెట్స్ కు వెళ్లకుండా ఆగిపోయింది. గేమ్ ఛేంజర్ కన్నా ముందు దర్శకుడు శంకర్ అపరిచితుడు హిందీ రీమేక్ ని రణ్వీర్ తో తీయాలని పెన్ స్టూడియోస్ తో ఒప్పందం చేసుకున్నారు. తీరా చూస్తే చరణ్ మూవీ ఫలితం లెక్కలను మార్చేసింది.

పైగా అంత పాత సినిమాను ఇప్పుడు తీయడం లాభసాటి కాదని పక్కన పెట్టారు. ఇప్పుడు రణ్వీర్ సింగ్ చేతిలో ప్రళయ్ అనే మూవీ ఉంది. ముంబై బ్యాక్ డ్రాప్ లో జాంబీల నేపథ్యంలో సరికొత్తగా ఉంటుందని అంటున్నారు. జై మెహతా దర్శకత్వంలో భారీ స్కేల్ లో తెరకెక్కిస్తారని ఇన్ సైడ్ టాక్

దురంధర్ అంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించని రణ్వీర్ సింగ్ ఇప్పుడేం చేయాలనే దాని మీద తర్జన భర్జన పడుతున్నాడట. మొన్నటిదాకా ఫ్లాపులతో మార్కెట్ రిస్క్ లో పడితే ఇప్పుడు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోవడం చూసి మాములు ఆనందంగా లేడు.

దురంధర్ 2 కూడా విజయవంతమైతే పుష్ప., బాహుబలి, కెజిఎఫ్, కాంతార సరసన తన మూవీ నిలుస్తుంది. మూడో వేల కోట్ల వసూళ్లు కొల్లగొట్టిన ఫ్రాంచైజ్ హీరోగా అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు వస్తుంది. అందుకే దురంధర్ 2 రిజల్ట్ తర్వాతే కొత్త ప్రోజెక్టుల గురించి నిర్ణయం తీసుకుంటాడని వినికిడి. డాన్ 3 ఉంటుందా లేదానేది అప్పుడే తేలొచ్చు.

This post was last modified on February 20, 2026 2:12 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

5 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

5 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

5 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

6 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

8 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

9 hours ago