Trends

మ్యాచు లేదు… డ్యూటీలో జాయిన్ అయిన స్టార్ క్రికెటర్

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చాలా రోజుల తరువాత ఒక సాధారణ ఉద్యోగిలా దర్శనమిచ్చాడు. శ్రీలంక పర్యటనకు వెళ్లిన టెస్ట్ జట్టులో అతనికి చోటు దక్కలేదు, ఆగస్టు చివర్లో మొదలయ్యే దేశవాళీ టోర్నీలకు కూడా ఇంకాస్త సమయం ఉంది. ఈ ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా అతను పట్నాలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ అసిస్టెంట్ మేనేజర్‌గా తన విధులు ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

స్పోర్ట్స్ కోటా కింద రిజర్వ్ బ్యాంక్‌లో ఇషాన్ కిషన్‌కు ఈ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం లభించిన విషయం తెలిసిందే. కానీ ఎప్పుడూ కూడా ఆఫీస్ లో ఒక ఉద్యోగిలా ఉన్న పోటోలు బయటకు రాలేదు. కానీ ఇప్పుడు ఆఫీస్‌లో మెడలో బ్లూ కలర్ ఐడీ కార్డు వేసుకుని తోటి ఉద్యోగులతో కలిసి అతను దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రౌండ్ లో దూకుడుగా బ్యాటింగ్ చేసే ఈ యంగ్ సెన్సేషన్, ఇలా సైలెంట్‌గా ఆఫీస్ వాతావరణంలో ఫార్మల్ డ్రెస్‌లో కనిపించడంతో అభిమానులను ఎట్రాక్ట్ చేస్తోంది.

నిజానికి రిజర్వ్ బ్యాంక్‌తో ఇషాన్ కిషన్‌కు చాలా మంచి అనుబంధం ఉంది. గతంలో కూడా క్రికెట్ నుంచి బ్రేక్ దొరికినప్పుడు అతను నవీ ముంబైలోని డి.వై. పాటిల్ స్టేడియంలో జరిగిన ప్రతిష్టాత్మక టీ20 టోర్నీలో ఆర్‌బీఐ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఈసారి ఏకంగా పట్నా బ్రాంచ్‌కు వచ్చి పూర్తిస్థాయిలో ఒక అసిస్టెంట్ మేనేజర్‌గా బ్యాంకింగ్ విధులను పర్యవేక్షిస్తుండటం విశేషం. ఖాళీ దొరికినప్పుడు ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తున్నాడు.

ఈ ఆఫీస్ డ్యూటీకి ముగింపు పలికి త్వరలోనే అతను మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో ఇషాన్ బరిలోకి దిగనున్నాడు. ఈ దేశవాళీ టోర్నమెంట్‌లో ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా అతను వ్యవహరించబోతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో మళ్లీ తన సత్తా చాటి భారత జట్టులో తిరిగి స్థానం సంపాదించాలనే పట్టుదలతో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టనున్నాడు. దులీప్ ట్రోఫీలో బరిలోకి దిగుతున్న ఈస్ట్ జోన్ జట్టులో ఇషాన్ కిషన్ నాయకత్వంలో అనేక మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, అభిమన్యు ఈశ్వరన్, ముకేశ్ కుమార్, షాబాజ్ అహ్మద్, వైభవ్ సూర్యవంశీ లాంటి ప్రసిద్ధ క్రికెటర్లు ఈ జట్టులో ఉన్నారు.

This post was last modified on August 5, 2026 12:27 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

6 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

7 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

7 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

9 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

11 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

12 hours ago