Movie News

నంది అవార్డులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

నంది అవార్డులు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంత ప్రతిష్టాత్మకంగా ఉండేవో ముందు తరం వారికి బాగా తెలుసు. ఈ అవార్డును అందుకోవడాన్ని గొప్ప గౌరవంగా భావించేవారు సినీ జనాలు. సినిమాలతో పాటు టీవీ, నాటక రంగాలకు కూడా నందులు ఇచ్చి గౌరవించేవి అప్పటి ప్రభుత్వాలు.

కానీ 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో కథ మారిపోయింది. ఫిలిం ఇండస్ట్రీ ఉన్నది హైదరాబాద్‌లోనే అయినా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవార్డులు ఇవ్వాలన్న ఆలోచనే చేయలేదు. మరోవైపు ఏపీ సర్కారు కొంత కాలానికి ఒకేసారి కొన్నేళ్లకు కలిపి నంది అవార్డులు ప్రకటించినా.. ఇండస్ట్రీ అక్కడ లేకపోవడం, బాగా ఆలస్యం కావడం, అవార్డుల్లో పారదర్శకత కనిపించకపోవడం వల్ల వాటికి సరైన గుర్తింపు లభించలేదు.

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ అవార్డులు కూడా అటకెక్కేశాయి. ఐతే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో అవార్డులు మొదలుపెట్టి కొన్నేళ్లకు కలిపి పురస్కారాలు ప్రకటించింది.

కాగా ఇప్పుడు ఏపీలో నంది అవార్డుల పునరుద్ధరణకు అడుగులు పడ్డాయి. కొన్ని నెలలుగా ఇందుకోసం కసరత్తు జరుగుతోంది. త్వరలోనే సినీ, టీవీ, నాటక రంగాలకు నంది అవార్డులు ఇవ్వబోతున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. నంది అవార్డులకు సీఎం చంద్రబాబు ఆమోదముద్ర వేసినట్లు కూడా ఆయన వెల్లడించారు.

2014, 2015, 2016 సంవత్సరాలకు గాను 2017లో నంది అవార్డులను అప్పటి ప్రభుత్వం ఇచ్చిందని… ఆ తర్వాత మళ్లీ అవార్డులు ప్రకటించలేదని దుర్గేశ్ తెలిపారు. అప్పటి నిబంధనల ప్రకారమే ఇప్పుడు కూడా అవార్డులు ఇవ్వాలా? లేక మార్పులు ఏమైనా చేయాలా? అనే దానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

నంది అవార్డుల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణల నుంచి ఈ అవార్డులపై సలహాలు తీసుకుంటామని తెలిపారు. రెండు, మూడు నెలల్లో అవార్డుల వేడుక ఉంటుందని వెల్లడించారు. నంది నాటకోత్సవాలను కూడా నిర్వహిస్తామని దుర్గేష్ చెప్పారు. బహుశా ఉగాదికి నంది అవార్డులను అందజేయొచ్చని తెలుస్తోంది.

This post was last modified on February 8, 2026 2:51 pm

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

31 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago