Movie News

ప్రభాస్ లేకుండా కల్కి-2 షూట్?

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన, చేస్తున్న, చేయబోయే ప్రతి సినిమా భారీ స్థాయిదే. కాస్టింగ్, బడ్జెట్ అన్నీ కూడా వేరే లెవెల్. అయినా సరే.. చాలా స్పీడుగానే సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. తన కోసం ఎప్పుడూ రెండు మూడు సినిమాల మేకర్స్ ఎప్పుడు డేట్లు ఇస్తాడా అని ఎదురు చూస్తుంటారు.

ఇటీవలే సంక్రాంతికి ‘ది రాజాసాబ్’ చిత్రంతో పలకరించిన ప్రభాస్.. ప్రస్తుతం సమాంతరంగా ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. రెండు చిత్రాలకు వీలు చూసుకుని డేట్లు సర్దుబాటు చేస్తున్నాడు. 

‘ఫౌజీ’ దసరాకు రిలీజ్ కావాల్సి ఉండడంతో ఎక్కువ ప్రయారిటీ దానికే ఇస్తున్నాడు. దీంతో పాటే అప్పుడప్పుడూ కొన్ని రోజులు ‘స్పిరిట్’ షూట్‌లో పాల్గొంటాడు. ఐతే ప్రభాస్ కోసం ‘కల్కి-2’ టీం కొన్ని నెలల ముందు నుంచే ఎదురు చూస్తోంది. ఈ సీక్వెల్‌కు స్క్రిప్టుతో పాటు ప్రి ప్రొడక్షన్ పనులూ పూర్తయిపోయాయి. షూట్ మొదలుపెట్టడానికి డేట్లు సర్దుబాటు ఒక్కటే అడ్డంకి అని ఇటీవల సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఐతే ప్రభాస్ కోసం మరీ ఎక్కువ కాలం ఎదురు చూస్తే కష్టమని.. త్వరలోనే షూట్‌కు వెళ్లిపోతున్నాడట దర్శకుడు నాగ్ అశ్విన్. ‘కల్కి’లోనే కాక ‘కల్కి-2’లోనూ కీలక పాత్రల్లో కొనసాగనున్న అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఈ సినిమా కోసం డేట్లు సర్దుబాటు చేశారట. మిగతా ఆర్టిస్టుల డేట్లు కూడా సర్దుబాటు చేసుకుని.. ముందుగా ప్రభాస్‌తో సంబంధం లేని సన్నివేశాల చిత్రీకరణ చేయబోతున్నాడట నాగ్ అశ్విన్.

అవి అయ్యాక ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ పనులు జరుగుతాయి. ప్రభాస్ ఎప్పుడు వస్తే అప్పుడు తన మీద ప్రత్యేకంగా తీయాల్సిన సన్నివేశాలు, వేరే ఆర్టిస్టులతో కాంబినేషన్ సీన్లు చేసుకుంటారు. ఇలా షూటింగ్ అయితే చాలా కాలమే సాగేలా కనిపిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో లేదా 2028 ఆరంభంలో రిలీజయ్యే అవకాశాలున్నాయి.

This post was last modified on February 8, 2026 3:08 pm

Share

Recent Posts

నాగ్ అప్పుడు బాధితుడు.. ఇప్పుడు చీఫ్ గెస్ట్!

రెండేళ్ల కిందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. హైదరాబాద్‌లో టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయడం…

46 minutes ago

రామాయణం… ఆల్ టైం రికార్డు పక్కా?

రామాయణం సినిమా రిలీజ్ ముంగిట ఎటు చూసినా నెగెటివ్ వార్తలే కనిపించేవి. రూ.4 వేల కోట్ల బడ్జెట్ సహా ఆ…

58 minutes ago

రైలు తలుపుల దగ్గర వేలాడే రోజులకు గుడ్‌బై

ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణం అంటేనే రద్దీ, హడావుడి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రైళ్లలో ఎక్కడం, దిగడం ప్రయాణికులకు…

3 hours ago

నువ్వు బీజేపీ వదిలిన బాణం అని మాకు తెలుసులే…

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన కొన్ని గంటలు కూడా కాలేదు. అప్పుడే ఆ…

4 hours ago

జటాయు మీద భారం వేసిన కాంబినేషన్

హీరో రోషన్ మేక, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కలయికలో కొత్త సినిమా మొదలయ్యింది. టైటిల్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు…

5 hours ago

త్రివిక్రమ్ శ్రీనివాస్ చుట్టూ కొత్త ప్రచారాలు

ఇటీవలే విడుదలైన ఆదర్శ కుటుంబం ఏకె 47తో రికార్డులు బద్దలు కొడతారనుకుంటే దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీవ్రంగా నిరాశ పరచడం…

6 hours ago