మెగాస్టార్ చిరంజీవిని మెప్పించి ప్రశంసలు అందుకుంటే ఆ నటుడికి అదొక గౌరవం. ఈ తరంలో తనకు నచ్చిన హీరో నవీన్ పొలిశెట్టి అని చిరు చెప్పినట్లుగా ఇటీవల ‘అనగనగా ఒక రాజు’ సినిమా సక్సెస్ మీట్లో దర్శకుడు బాబీ చెబితే.. నవీన్ ఎంతగా పొంగిపోయాడో.
అలాగే తనకు సంబంధం లేని సినిమాలో ఫలానా నటుడు ఈ పాత్రలో బాగుంటాడు, అతణ్ని తీసుకో అని ఒక దర్శకుడికి చిరు చెప్పాడంటే ఆ నటుడిపై ఆయనకు ఎంత గురి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాగే ఒక పాత్రకు విజయ్ సేతుపతి పేరును సూచించాడట మెగాస్టార్.
తెలుగు వారికీ సుపరిచితుడైన తమిళ సీనియర్ నటుడు అర్జున్.. దర్శకుడిగానూ కొన్ని సినిమాలు తీశాడు. ఇప్పుడాయన స్వీయ దర్శకత్వంలో ‘సీతా పయనం’ అనే చిత్రాన్ని రూపొందించాడు. ఇందులో అర్జున్ తనయురాలు ఐశ్వర్య లీడ్ రోల్ చేసింది. ఆమెకు జోడీగా నిరంజన్ అనే కొత్త కుర్రాడు నటించాడు.
ఇందులో రౌడీగా ఒక కీలక పాత్ర ఉంది. ఆ పాత్రలో అర్జునే నటించాడు. కానీ ఆ పాత్రకు విజయ్ సేతుపతిని తీసుకోమని చిరు చెప్పాడట. ‘సీతాపయనం’ కథ చిరుకు బాగా తెలుసని.. ఆయనకు ఇది ఎంతో నచ్చిందని.. ఇందులో కీలక పాత్రకు సేతుపతి బాగుంటాడని చిరు అభిప్రాయపడ్డాడని.. కానీ డేట్ల సమస్య వల్ల అతనీ చిత్రంలో నటించకపోవడంతో చివరికి తానే ఆ పాత్ర చేశానని అర్జున్ వెల్లడించాడు.
నటుడిగా తన కెరీర్లో ఎక్కువగా యాక్షన్ సినిమాలే చేసినప్పటికీ.. దర్శకుడిగా తన అభిరుచి ‘సీతాపయనం’ లాంటి క్లాస్ సినిమాలే అని అర్జున్ తెలిపాడు. సమాజానికి మంచి విషయాలు చెప్పాలనే తపన తనలో ఉందని.. ఈ క్రమంలోనే ‘సీతాపయనం’ చేశానని.. ఇది హృద్యంగా సాగే చిత్రమని అతనన్నాడు.
‘సీతాపయనం’లో అర్జున్ మేనల్లుడు ధ్రువ్ సర్జా కూడా ఒక ప్రత్యేక పాత్ర చేశాడు. ఇందులో ఐశ్వర్యకు జోడీగా ముందు విశ్వక్సేన్‌ను ఎంచుకున్నాడు అర్జున్. కానీ షూట్ మొదలయ్యే ముందు అతనీ చిత్రం నుంచి తప్పుకోవడం వివాదాస్పదమైంది. దీని మీద అర్జున్ చాలా హర్టయి ప్రెస్ మీట్ కూడా పెట్టాడు రెండేళ్ల ముందు.
This post was last modified on February 8, 2026 12:45 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…