Movie News

దిల్ రాజుకు, నాగవంశీకి చెడిందా?

టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే ఉంది. ఇద్దరూ పరస్పర నమ్మకంతో పని చేస్తుంటారు. నాగవంశీ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్‌‌తో పాటు అతడి బాబాయి చినబాబు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్లో నిర్మించే సినిమాలను చాలా ఏళ్ల నుంచి నైజాం, వైజాగ్ ఏరియాల్లో దిల్ రాజే పంపిణీ చేస్తూ వస్తున్నారు.

రాజు గురించి నాగవంశీ, నాగవంశీ గురించి దిల్ రాజు ఎప్పుడూ చాలా పాజిటివ్‌గా మాట్లాడుతుంటారు.
సినిమాల డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాల్లో ఇద్దరూ పరస్పర సహకారంతో సాగుతుంటారు. సినిమాకు మంచి లాభం వస్తే నిర్మాతకు పంచడంలో, అలాగే నష్టం వస్తే తమకు భర్తీ చేయడంలో అండర్‌స్టాండింగ్‌తో ఉంటామని దిల్ రాజు సోదరుడు శిరీష్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఇటీవల ‘అనగనగా ఒక రాజు’ సక్సెస్ మీట్లో.. నాగవంశీ తనకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నాడని దిల్ రాజు స్టేట్మెంట్ ఇచ్చాడు. నాగవంశీ సైతం రాజుకు ఎప్పుడూ మంచి ఎలివేషనే ఇస్తుంటాడు.

ఇలాంటి అనుబంధం ఉన్న వ్యక్తుల మధ్య ఇప్పుడు బ్రేక్ రావడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ నైజాంలో తన సినిమాల పంపిణీని రాజుకే అప్పగించే నాగవంశీ.. ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నాడు. తమ ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న కొన్నిసినిమాల హక్కులను అక్కినేని నాగార్జున సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌కు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి.

ముందుగా వచ్చే శుక్రవారం రిలీజయ్యే ‘ఫంకీ’ సినిమాను అన్నపూర్ణ సంస్థలో రిలీజ్ చేయిస్తున్నాడు నాగవంశీ. ఆ తర్వాత ‘బేబి’ కాంబినేషన్లో నిర్మిస్తున్న ‘ఎపిక్’ సినిమా హక్కులనూ నాగ్ సంస్థకే కట్టాబెట్టాడట.

అంతే కాక హారిక అండ్ హాసిని సంస్థలో, వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘ఆదర్శ కుటుంబం’ను సైతం నాగార్జునే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మామూలుగా ఆయా సినిమా డిమాండును బట్టి నిర్మాతలు ఎక్కువ రేటు ఇచ్చే డిస్ట్రిబ్యూటర్‌కు ఇస్తుంటారు. కానీ కొందరు మాత్రం కొన్ని ఏరియాల్లో ఒకే డిస్ట్రిబ్యూటర్‌తో కొనసాగుతుంటారు.

రాజు, నాగవంశీలది అలాంటి బలమైన బంధమే. మరి దాన్ని బ్రేక్ చేసి నాగార్జునకు తమ కొత్త సినిమాల హక్కులు ఇచ్చారంటే రాజుతో నాగవంశీకి చెడిందా.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణాలేంటి.. ఇంతకుముందు పంపిణీ చేసిన సినిమాల లెక్కల్లో ఏమైనా తేడాలు వచ్చాయా అనే చర్చ జరుగుతోంది.

This post was last modified on February 4, 2026 1:48 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

1 hour ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

3 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

4 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

4 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

4 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

4 hours ago