Movie News

మామతో దళపతి… మాజీ అల్లుడితో ఎమోషనల్ డ్రామా

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు వందల సినిమాల ప్రయాణం చాలా తేలికగా చేయగలిగారు. ఏడు పదుల వయసులోనూ హుషారుగా నటిస్తున్నారు.

భాషతో సంబంధం లేకుండా కథ నచ్చితే చాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆయన శైలి. స్వాతికిరణంలో నెగటివ్ షేడ్స్ ఉన్నా, ఏజెంట్ లో మెయిన్ హీరో అఖిల్ లాంటి కుర్రాడైనా, యాత్ర ఒక ముఖ్యమంత్రి బయోపిక్ అని తెలిసినా వెనుకాడలేదు. తాజాగా ధనుష్ 55వ సినిమాకు మమ్ముట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకుడు.

ఇక్కడో విశేషం చెప్పుకోవాలి. 1992 దళపతిలో రజనీకాంత్, మమ్ముట్టి కలిసి నటించారు. ఇప్పటికీ స్నేహం మీద వచ్చిన బెస్ట్ గ్యాంగ్ స్టర్ మూవీస్ లో దీనికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మణిరత్నం క్లాసిక్స్ లో దళపతి ప్లేస్ టాప్ ఫైవ్ లో పదిలం. తర్వాత మళ్ళీ ఆ కాంబో రిపీట్ కాలేదు.

ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత రజినీకాంత్ అల్లుడు (అఫ్కోర్స్ మాజీ అయినప్పటికీ) ధనుష్ తో స్క్రీన్ పంచుకోవడం మమ్ముట్టికే సాధ్యమని చెప్పాలి. సాయిపల్లవి, శ్రీలాల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంక్కర్ సంగీతం సమకూర్చడం విశేషం. ఈ ఏడాదే దసరా లేదా దీపావళికి రిలీజ్ చేసేలా నిర్మాతలు ప్లానింగ్ లో ఉన్నారు.

ఇదొక అరుదైన ఫీట్ గా అభిమానులు చర్చించుకుంటున్నారు. మమ్ముట్టి రాకతో ఈ ప్రాజెక్టు స్కేల్ పెరిగిపోయింది. మలయాళంలో ఎలాగూ ఆయన మార్కెట్ రూపంలో భారీ బిజినెస్ జరుగుతుంది కాబట్టి తమిళ తెలుగు రిలీజ్ ద్వారా మంచి టార్గెట్స్ పెట్టుకోవచ్చు. ఇది కూడా ఎమోషనల్ డ్రామాగా ఉంటుందని చెన్నై టాక్.

కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా అన్ని వర్గాలను టార్గెట్ చేసుకుంటూ బయట ప్రపంచానికి తెలియని ఒక రియల్ లైఫ్ హీరో కథనే చెప్పబోతున్నట్టు సమాచారం. మరి ధనుష్, మమ్ముట్టిల మధ్య తెరమీద ఎలాంటి బాండింగ్ ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది బహుశా గురుశిష్యులుగా కనిపిస్తారేమో.

This post was last modified on February 4, 2026 2:36 pm

Share

Recent Posts

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

52 minutes ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

2 hours ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

3 hours ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

3 hours ago

వృషకర్మ… తెలివైన పని చేసిందమ్మ

ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…

4 hours ago

యూపీఐ లో కొత్త షార్ట్‌కట్… స్కాన్ లేకుండానే పేమెంట్

షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…

5 hours ago