ప్రమోషన్ల విషయంలో దూకుడు చూపించకుండా నెమ్మదిగా పబ్లిసిటీ చేసుకుంటున్న కాంతార చాప్టర్ 1 ది లెజెండ్ ట్రైలర్ మీద ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొనడం చూస్తున్నాం. అయితే మూడు నిమిషాల కంటెంట్ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు కనిపిస్తున్నాయి. మొదటి భాగం వచ్చినప్పుడు ఎలాంటి బజ్ లేదు. సైలెంట్ కిల్లర్ గా వచ్చి వందల కోట్లు కొల్లగొట్టేసింది. కానీ ఇప్పుడీ పార్ట్ 1 అలా కాదు. హోంబాలే ఫిలిమ్స్ భారీగా ఖర్చు పెట్టింది. టికెట్ రేట్ల కోసం ఏకంగా కర్ణాటక ప్రభుత్వం మీద కోర్టుకు వెళ్ళింది. ఇంత చేసిందంటే కంటెంట్ ఓ రేంజ్ లో ఉన్నట్టే.
కాంతార చాప్టర్ 1 ట్రైలర్ లో విజువల్స్ బాగున్నాయి, యాక్షన్ ఎపిసోడ్లు ఆసక్తి రేపాయి. కానీ ఆశించిన హై పూర్తి స్థాయిలో దక్కలేదన్నది ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న కామెంట్. బాహుబలి, కెజిఎఫ్ సీక్వెల్స్ వచ్చినప్పుడు ఏదైతే బజ్ నెలకొందో అది దీని విషయంలో చూడటం లేదని అభిప్రాయపడుతున్నారు. కేవలం కొన్ని శాంపిల్స్ మాత్రమే చూపించి అసలైన స్టఫ్ దాచిపెట్టరేమో అనే అనుమానం కలగడం సహజం. ఇక్కడ హీరో అండ్ దర్శకుడు రిషబ్ శెట్టి ఎదురుకోవాల్సిన ఛాలెంజ్ పెద్దదే ఉంది. మొదటిది ఓజిని కాచుకోవడం. ఏపీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఫీవర్ మాములుగా లేదు.
ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే ఓజి సునామి కనీసం రెండు వారాల పాటు భీభత్సంగా ఉంటుంది. దానికి ధీటుగా కాంతార 1 ఉందనే టాక్ తెచ్చుకోవాలి. ఇక రెండోది ధనుష్ ఇడ్లి కొట్టు తమిళనాడులో టఫ్ కాంపిటీషన్ ఇచ్చేలా ఉంది. అది కూడా ట్రైలర్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ని తనవైపు లాగుతోంది. తెలుగు వెర్షన్ కి అంత రెస్పాన్స్ రాలేదు కానీ కోలీవుడ్ జనాలు మాత్రం ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతున్నారు. సరే ట్రైలర్ల కథలు ఎలా ఉన్నా ఫైనల్ గా థియేటర్లో రెండున్నర గంటలు ఎవరు మెప్పిస్తారో వాళ్లే విజేతలవుతారు. కాంతార 1కు వచ్చిన చిక్కల్లా ట్రైలర్ కు అన్ని వర్గాల నుంచి యునానిమస్ టాక్ రాకపోవడమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates