ఓజి బుకింగ్స్ మొదలైపోయాయి. ముఖ్యంగా తెలంగాణ అమ్మకాలు ర్యాంపేజ్ స్థాయిలో ఉన్నాయి. పెట్టడం ఆలస్యం క్షణాల్లో సోల్డ్ అవుట్ చూపిస్తున్నాయి. హైదరాబాద్ ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న థియేటర్లలో సైతం ఫాస్ట్ ఫిల్లింగ్ ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ప్రీమియర్ షోలు అందుబాటులోకి రాలేదు. రెగ్యులర్ షోలకే ఇంత డిమాండ్ ఉంది. క్రాస్ రోడ్స్ సింగల్ స్క్రీన్లలో అప్పర్ బాల్కనీ రేట్ 445 రూపాయలు ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పెంపు ఇచ్చింది వందే అయినప్పుడు ఇంత భారీ మొత్తం ఎలా పెట్టారనేది తెలియాల్సి ఉంది. మిగిలిన చోట్ల 275 రూపాయలు ఉంది.
ఇంకా మల్టీప్లెక్సుల షోలు జోడించలేదు. ఓజి టీమ్ ఈసారి ఎక్స్ క్లూజివ్ గా డిస్ట్రిక్ట్ యాప్ తో టైఅప్ కావడంతో ముందుగా అందులోనే టికెట్లు పెట్టారు. ఏపీలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అర్ధరాత్రి ఒంటి గంట షోకు వెయ్యి రూపాయల టికెట్లకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో ముందు రోజు రాత్రే షోలు వేస్తుండటంతో ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్లు, ఫ్యాన్స్ అయోమయం చెందుతున్నారు. మార్పులు చేసిన కొత్త జిఓ రావొచ్చనే ప్రచారం నేపథ్యంలో మధ్య రాత్రి ఆటల బుకింగ్స్ ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేలేదు. పెట్టినవి ముక్క మిగలకుండా అయిపోయాయి.
ఇంకో అయిదు రోజులు సమయం ఉంది కాబట్టి ఈ షోలు, ఓపెనింగ్ రికార్డులు, థియేటర్ల పంపకాలకు సంబంధించి బోలెడు అప్డేట్స్ రాబోతున్నాయి. ఎలా చూసుకున్నా ఒకటి ముందు, ఒకటి వెనుక కాకుండా రెండు రాష్ట్రాల్లో 24 రాత్రి ఓజి బెనిఫిట్ షోలు ఉండటం పక్కానే. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏపీ జిఓలో మిడ్ నైట్ షోల ప్రస్తావన వచ్చిందని, ఇప్పుడు తెలంగాణది చూశాక పూర్తి క్లారిటీ రావడంతో సవరణలు చేసి ఏ క్షణమైనా వదిలే అవకాశముందని వినికిడి. ట్రైలర్ రాకుండానే ఓజి ఇంత రచ్చ చేస్తోందంటే రేపు ఉదయం అసలు కంటెంట్ చూశాక అంచనాలు ఎక్కడికి వెళ్ళిపోతాయో వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates