పవన్‍కళ్యాణ్ కోసం హరీష్ శంకర్ ఒక సూపర్ మాస్ కథ సిద్ధం చేసాడట. తండ్రీ కొడుకుల పాత్రలను పవన్ కోసం హరీష్ తీర్చిదిద్దాడట. ఈసారి చేసే సినిమాలో వినోదంతో పాటు పవన్ ఆశయ సాధనకు పనికొచ్చే అంశాలను కూడా హరీష్ రంగరించాడట. అయితే హరీష్ శంకర్ నంబర్ ఇప్పుడు వకీల్ సాబ్ తర్వాత మూడవ స్థానంలో వుంది. ముందుగా అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ పూర్తి చేసి, ఆ తర్వాత క్రిష్ చిత్రానికి డేట్స్ ఇచ్చి… ఆ తర్వాతే హరీష్ శంకర్ సినిమా మొదలు పెడతాడట.
ఈలోగా పవన్‍కి ముప్పయ్, నలభై రోజులలో పూర్తి చేసేసే మరో రీమేక్ కథ ఏదైనా దొరికితే ఎలాగుంటుందనేది తెలీదు. హరీష్ శంకర్ మాత్రం ఈ సినిమా చేసే వరకు వేరే ఏ సినిమా చేయనని భీష్మించుకుని కూర్చున్నాడు. అవసరమయితే ఈలోగా వెబ్ సిరీస్‍లు చేయడం లేదా వేరే దర్శకుల సినిమాలకు రచన చేయడం చేస్తానే తప్ప పవన్ వచ్చే వరకు పక్క చూపులు చూసేది లేదంటున్నాడు. మరోవైపు హరీష్ కథ గురించిన లీకులు బయటకు వచ్చే కొద్దీ ఫాన్స్ ఈ సినిమా కోసం తపించిపోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates