టెలివిజన్ తారలలో అనసూయ భరద్వాజ్ కి ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ మరో తెలుగు యాంకర్ కి లేదంటే అతిశయోక్తి కాదేమో. సుమ ఫామిలీ ఆడియన్స్ కి నచ్చే యాంకర్ అయితే, అనసూయ కి సెక్సీ యాంకర్ గా కుర్రాళ్ళు, మాస్ లో ఫాలోయింగ్ ఎక్కువ. అందుకే ఆమె ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చినా కూడా అది అటెన్షన్ రాబట్టుకుంటుంది. ఆమె ఇచ్చే స్టేట్మెంట్స్ పలుమార్లు ట్రోల్ అవుతుంటాయి కూడా.
తనని ట్రోల్ చేసే వారికి తానేంటో తెలియదని, తానేంటో తెలిస్తే ఎవరూ ట్రోల్ చేయరని అంటోంది. వెండి తెరపై గ్లామరస్ గా కనిపించడానికి అనసూయకి అభ్యంతరాలు లేవు. బికినీ వేసుకోవడానికి కూడా తనకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ బికినీ వేసుకోవడానికి తగ్గ బాడీ తనకి ఇప్పుడు లేదని అనసూయ చెప్పింది. తనకి బికినీ వేసుకునే ఫిట్ బాడీ ఉంటే తప్పకుండా వేసుకుంటానని, దానికి వెనుకాడేది లేదని ఆమె స్పష్టం చేసింది.
యాభై ఏళ్ళకి దగ్గర పడుతోన్న మలైకా అరోరా, మందిర బేడీ లాంటి మమ్మీస్ బికినీల్లో కనిపిస్తున్నప్పుడు అంత కంటే చాలా యంగ్ అయినా అనసూయ వేసుకుంటే తప్పేముంటుంది. కాకపోతే ఆమెకి కాన్ఫిడెన్స్ ఇచ్చేంత స్లిమ్ బాడీ రావాలని ఫాన్స్ కోరుకోవాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates