బాలీవుడ్ స్టార్ హీరో.. మిస్టర్ ఇండియా అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ బాలీవుడ్ లో ఫ్యాషన్ దివాగా పేరు తెచ్చుకుంది. 2005లో సంజయ్ లీలా బంసాలితో కలిసి బ్లాక్ సినిమాకు సహాయ దర్శకురాలిగా పనిచేసిన సోనం 2007లో అతని దర్శకత్వంలో సావరియా అనే చిత్రంతో రణబీర్ కపూర్ తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.ఢిల్లీ-6,బిట్టు శర్మ,ఐ హేట్ లవ్ స్టోరీస్,ప్రేమ్ రతన్ ధన్ పాయో లాంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.