గత కొన్ని రోజులుగా ఫిట్నెస్ పై బాగా ఫోకస్ పెడుతున్న నాగబాబు జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తూ అప్పుడప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అనుకున్నది సాధించడానికి వయసు అసలు ఆడే కాదు అన్నట్టు దూసుకుపోతున్న నాగబాబు చాలా మందికి ఇన్స్పిరేషన్ అనడంలో సందేహం లేదు.
ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు దీటుగా కండలు పెంచేస్తున్నాడు ఈ మెగా బ్రదర్..తాజాగా జిమ్ లో తన కండలు చూపిస్తూ వర్కౌట్ చేస్తున్న ఓ భారీ కటౌట్ ఫోటోని పోస్ట్ చేసారు . అంతేకాదు “చిన్నగా ప్రారంభించండి, స్థిరంగా ఉండండి.. మీకోసం మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు అని గుర్తుంచుకోండి..”అంటూ ఓ క్యాప్షన్ ని కూడా పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ కావడంతో మెగా అభిమానులు నాగబాబు ఫిట్నెస్‌ను తెగ పొగిడేస్తున్నారు.