
మెగా బ్రదర్స్ అంటే చిరంజీవి ,పవన్ కళ్యాణ్ కంటే కూడా మీమర్స్ కి ముందుగా గుర్తుకు వచ్చేది నాగబాబు. సహాయ నటుడిగా, పలు కామెడీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న నాగబాబు మరోపక్క తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయన యమధీర అనే చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. ఇటు సినిమాలు, అటు రాజకీయాలలో ఎప్పుడు బిజీగా ఉండే నాగబాబు తన ఫిట్నెస్ విషయంలో మాత్రం తగ్గేదే లేదు అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates