Trends

ఐపీఎల్ నడుస్తుందా.. మధ్యలో ఆగిపోతుందా?

గత ఏడాది కరోనా దెబ్బకు తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారతీయులకు గొప్ప ఉపశమాన్నిచ్చిన టోర్నీ ఇండియన్ ప్రిమియర్ లీగ్. కొన్ని నెలల పాటు బయటకు అడుగు పెట్టే అవకాశం లేక బయట అన్ని రకాల వినోదాలు దూరమైన సమయంలో యూఏఈలో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌ ఎన్నడూ లేనంత ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా సాగి అభిమానులను మురిపించింది. గాయపడ్డ భారతీయుల హృదయాలకు ఆ టోర్నీ మందేసిందనడంలో సందేహం లేదు. ఈసారి యధావిధిగా …

Read More »

ఆమె ఎంబీబీఎస్.. పక్కింట్లో 9క్లాస్ చదివే పిల్లాడు.. నమ్మినందుకు టార్చర్

హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఉదంతం గురించి తెలిస్తే.. ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అన్న సందేహమే కాదు.. చిన్న వయసులో ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలా? అన్న షాక్ కు గురి కావాల్సిందే. హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ ఉదంతం ఎంతకూ మింగుడుపడనిదిగా మారుతుంది. పోలీసులు సైతం విస్మయానికి గురైన ఈ ఉదంతంలోకి వెళితే.. హైదరాబాద్ లోని ఒక కాలనీలో ఎంబీబీఎస్ చదివి అమ్మాయి పక్కింట్లో తొమ్మిది తరగతి …

Read More »

అందాల పోటీల వేదికపై ఆమె మాట.. ప్రపంచాన్ని కదిలించింది

అందాల పోటీలు అన్నంతనే వయ్యారాలు ఒలకపోయటం.. కళ్లు చెదిరే అందాల్ని ప్రదర్శించటం.. నవ్వుతూ.. తుళ్లుతూ.. మహా ఉత్సాహభరితంగా సాగే తీరుకు భిన్నంగా సాగిన ఒక పోటీ ఇప్పుడుహాట్ టాపిక్ గా మారింది. ఇందుకు థాయిలాండ్ వేదికగా మారింది. ఇటీవల కాలంలో ఒక బ్యూటీ కాంటెస్టు లో పాల్గొన్న కంటెస్టెంట్ చేసిన వ్యాఖ్యలు.. ప్రపంచ దేశాలు ఆమె వైపు చూసేలా చేయటమే కాదు.. ఆమె దేశంలో జరుగుతున్న దారుణాన్ని కళ్లకు కట్టేలా …

Read More »

ప్రపంచ సంపన్నుల్లో మన తెలుగోళ్ల లెక్కేంటి?

ఏడాదికి ఒకసారి ప్రముఖ మీడియా దిగ్గజం ఫోర్బ్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నుల లెక్క కట్టటం తెలిసిందే. ఏడాదికి ఒకసారి ఈ సంస్థ పలు అంశాల్ని పరిగణలోకి తీసుకొని మదింపు చేసి.. సంపన్నుల తుది జాబితాను సిద్ధం చేస్తుంది. ఈ ఏడాది రూ.7350 కోట్ల కంటే ఎక్కువ సంపద ఉన్న వారిని లెక్క కట్టింది. ఇలాంటివారు ప్రపంచ వ్యాప్తంగా 2755 మందిగా తేల్చింది. టాప్ టెన్ జాబితాలో రిలయన్స్ …

Read More »

సొంత చెల్లెలి పై.. అత్యాచారానికి పాల్పడిన అన్నలు ..!

తనకు తోడ బుట్టిన చెల్లెలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ తనకు పెళ్లి చేసి ఒకరి చేతిలో పెట్టాల్సిన అన్నలే ఆ బాధ్యతను మరిచిపోయి సొంత చెల్లెలి పై అత్యాచారానికి పాల్పడిన ఘటన కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సొంత చెల్లెలినే శారీరకంగా లోబర్చుకొని ఎన్నో చిత్రహింసలకు గురి చేస్తూ నరకం చూపిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మణుగూరుకు చెందిన ఓ వ్యక్తి కొత్తగూడెంలోని సింగరేణిలో రెస్క్యూ …

Read More »

ఐపీఎల్‌లో తెలుగు క్రికెట‌ర్‌.. జెర్సీ మూమెంట్‌

భార‌తీయుల‌కు అత్యంత ఇష్ట‌మైన రెండు విష‌యాలు.. సినిమా, క్రికెట్. ఈ రెంటికీ ముడి పెడితే యువ‌త‌కు అంత‌కంటే వినోదం మ‌రొక‌టి ఉండ‌దు. అందుకే క్రికెట్ నేప‌థ్యంలో తీసిన సినిమాలు చాలా వ‌ర‌కు గొప్ప ఫ‌లితాన్నందుకున్నాయి. రెండేళ్ల కింద‌ట వ‌చ్చిన నేచుర‌ల్ స్టార్ నాని సినిమా జెర్సీ క్రికెట్ నేప‌థ్యంలోనే న‌డుస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అందులో కొన్ని స‌న్నివేశాలు ఎంత ఉద్వేగ‌భ‌రితంగా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ముఖ్యంగా త‌న‌కు …

Read More »

పక్కా ప్లాన్ తోనే మావోయిస్టుల దాడి ?

అవును ఛత్తీస్ ఘడ్ తరెం అటవీప్రాంతంలో సీఆర్పీఎఫ్ పోలీసులపై మావోయిస్టులు విసిరిన పంజాకు సుమారు 25 మంది జవాన్లు బలైపోయారు. ఇపుడీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది కాబట్టి చనిపోయిన వారిసంఖ్య 25 అని చెప్పేందుకు లేదు. నిజానికి తెలుగురాష్ట్రాల్లోని గ్రేహౌండ్స్ పోలీసులకు మావోయిస్టుల ఏరివేతలో ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంది. సీఆర్పీఎఫ్ పోలీసులకు గ్రేహౌండ్స్ తరహా ట్రైనింగ్ లేదనే చెప్పాలి. అయినా సరే మావోయిస్టులను వెతుక్కుంటు …

Read More »

హైదరాబాద్‌లో ఐపీఎల్?

కరోనా నేపథ్యంలో ఈసారి ఇండియన్ ప్రిమియర్ లీగ్ వేదికల్ని ఆరుకు పరిమితం చేయడం.. ఎప్పుడూ ఐపీఎల్ జరిగే హైదరాబాద్, జైపూర్, మొహాలిలను వేదికల జాబితా నుంచి తప్పించడం తెలిసిన సంగతే. ముంబయి, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలతో పాటు అహ్మదాబాద్‌ల్లో మాత్రమే మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఐపీఎల్ మ్యాచ్‌లకు మంచి ఆదరణ ఉండే దేశంలోనే అత్యుత్తమ స్టేడియాల్లో ఒకటైన ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు …

Read More »

పెళ్లి చూపులకు వెళ్లి… ఆ యువతితో ఎస్కేప్… చివరికి..?

అందరిలాగే ఓ యువకుడు పెళ్లి చూపులకు వెళ్ళాడు. ఆ యువకుడికి యువతి నచ్చింది. కానీ ఇరు కుటుంబాలకు కట్నకానుకల విషయంలో పరస్పరం బేధాభిప్రాయాలు రావటం వల్ల ఈ సంబంధం వద్దనుకున్నారు. కానీ ఆ యువతీ, యువకుడు ఒకరినొకరు ఇష్టపడటంతో వారిరువురు ఫోన్ నెంబర్లను మార్చుకొని తరుచు ఫోన్లలో మాట్లాడుతూ ఉండేవారు. ఎలాగైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అది కుదరదని తెలిసిన క్షణంలో వారిద్దరూ కలిసి హైదరాబాద్ …

Read More »

బ్రేకింగ్: ఫూణెలో హోటళ్లు.. థియేటర్లు క్లోజ్..

Lockdown

ఎంతలా ప్రయత్నిస్తున్నా.. కరోనా కేసులు పెరగటమే తప్పించి తగ్గే సూచనలు కనిపించని దుస్థితి. దేశంలో నమోదయ్యే కేసుల్లో సింహభాగం మహారాష్ట్రలోనే ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలోని ముంబయి తర్వాత అత్యధిక కేసులు నమోదవుతున్ననగరాల్లో ఫూణె ఒకటి. దీంతో..వైరస్ వ్యాప్తిని అరికట్టి.. కేసుల తీవ్రతను తగ్గించేందుకు వీలుగా ఫూణె డివిజనల్ కమిషనర్ కీలక ఆదేశాల్నిజారీ చేశారు. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో ఒక్క ఫూణెలోనే 8011 కేసుల్ని గుర్తించారు. …

Read More »

చిచ్చు పెట్టిన మొబైల్ గేమ్.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..!

ఆన్లైన్ గేమ్ లకు ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ఉంది. యాంగ్రీ బర్డ్, పబ్జి , ఫ్రీ ఫైర్ వంటి ఆన్లైన్ గేమ్ లు యువతను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ ఆన్లైన్ గేమ్ ల పిచ్చిలో పడి యువత ఏం చేస్తున్నారో కూడా గ్రహించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఆన్లైన్ గేమ్ పిచ్చిలో పడి 2 వర్గాల యువకుల మధ్యన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. …

Read More »

న్యూడ్ చాటింగ్ స్కాం – నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య

తియ్యగా మాట్లాడతారు. ఇష్టాన్ని.. ప్రేమను ప్రదర్శిస్తారు. అంతిమంగా తిరుగులేని వలపు వల విసురుతారు. అప్పటికే మైకం కమ్మి.. విచక్షణ కోల్పోతారు. అంతిమంగా వల విసిరిన వారికి చిక్కి విలవిలలాడతారు. అయినప్పటికి వేధింపులకు గురి చేసే వారి దెబ్బకు హడలిపోతూ వారు కోరుకున్న డబ్బును అప్పు చేసైనా ఇచ్చి.. ఆ ఉచ్చులో నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్న వైనాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి వారి చేతికి చిక్కిన ఒక …

Read More »