టోక్యో ఒలంపిక్స్ లో భారత్ కి మరో పతకం దక్కింది. వరుసగా రెండోసారి ఒలింపిక్స్ లో పతకం సాధించింది తెలుగు తేజం పీవీ సింధు. చైనా క్రీడాకారిణి బింగ్జియావోతో జరిగిన పోరులో గెలిచి కాంస్యం దక్కించుకుంది. 21-13, 21-15 తేడాతో సింధు అద్భుత విజయం సాధించింది.
శనివారం, సింధు సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ వన్ చైనీస్ తైపీకి చెందిన తాయ్ త్జుతో తలపడింది, ఆమె శనివారం 18-21, 12-21తో ఓడిపోయింది. దీంతో బంగారు, సిల్వర్ పతకం చేజార్జుకోవాల్సి వచ్చింది. నేటి మ్యాచ్ లో విజయం సాధించి కాంస్యం గెలుచుకుంది.
ఏస్ ఇండియన్ షట్లర్ రెండు వ్యక్తిగత ఒలింపిక్ పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళ సింధు కావడం గమనార్హం. 2016 రియో ఒలింపిక్స్ లో సింధు సిల్వర్ మెడల్ గెలిచింది.ఇప్పుడు కాంస్యం సాధించింది.
ఒలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక భారతీయుడు రెజ్లర్ సుశీల్ కుమార్. అతను 2008 బీజింగ్‌లో గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు మరియు లండన్ గేమ్స్‌లో ఒక మెట్టు మెరుగ్గా వెండి పతకాన్ని సాధించాడు, దేశానికి ఏకైక రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయ్యాడు, ఇప్పుడు సింధు అతని సరసన నిలిచింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates