టోక్యో ఒలంపిక్స్ లో భారత్ ఖాతాలో మరో కాంస్య పతకం చేరింది. బ్యాడ్మింటన్ లో ఎలాగూ.. స్వర్ణం చేజారింది.. కనీసం బాక్సింగ్ లోనైనా గెలుస్తామని అందరూ ఆశగా ఎదురు చూశారు. అయితే.. ఆ ఆశలు గల్లంతయ్యాయి. టోక్యో ఒలంపిక్స్ సెమీస్ పోరులో లవ్లీనా ఓటమి పాలయ్యింది.
తీవ్రమైన ఉత్కంఠ పోరులో లవ్లీనా బొర్గొహెయిన్ నిరాశ పరిచింది. టర్కీ బాక్సర్ బుసెనాజ్ సుర్మేనెలి … లవ్లీనా పై అద్భుతమైన విజయం సాధించింది. 64-69 కిలోల విభాగంలో జరిగిన సెమీస్ పోరులో లవ్లీనా ఓటమి చవి చూసింది. ఈ పోరులో టర్కీ బాక్సర్ బుసెనాజ్ సుర్మేనెలి చేతిలో 0-5 తేడాతో పరాజయం పాలైంది.
మూడు రౌండ్ల లోనూ టర్కీ బాక్సర్ బుసెనాజ్ సుర్మేనెలి లవ్లీనా పై ఆధిపత్యం చెలాయించింది. దీంతో లవ్లీనా పరాజయం పాలైంది. ఓటమి పాలైనప్పటికీ లవ్లీనా బొర్గొహెయిన్ చరిత్ర సృష్టించింది. బలింపిక్స్ లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా అవతరించింది. దీంతో లవ్లీనా కాంస్య పతకానికే పరిమితం కావాల్సి వచ్చింది. అయినప్పటికీ..లవ్లీనా పోరాట పటిమను అందరూ మెచ్చుకుంటున్నారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.