ఆ భూమి జూనియర్ ఎప్పుడో అమ్మేశాడు !

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం బ్యాంకులకు చెందుతుందని ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వగా దానిపై అతను హైకోర్టును ఆశ్రయించినట్లు నిన్న వార్తలు రావడం తెలిసిందే. అయితే దీనిపై జూనియర్ ఎన్టీఆర్ టీమ్ స్పందించింది.

2003లో కొన్న ఆ స్థలాన్ని జూనియర్ 2013లోనే విక్రయించాడని, ఆ స్థలంతో, ఆ వివాదంతో ఎన్టీఆర్ కు సంబంధం లేదని పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వివాదం విషయంలో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించినట్లు వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే మహిళ నుండి కొనుగోలు చేశాడని, అందులో నిర్మాణం చేపట్టాడని, ఆమె స్థలం జూనియర్ ఎన్టీఆర్ కు ఆ స్థలం అమ్మడానికి ముందే 1996లో తమ వద్ద తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారని ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంకులు ట్రిబ్యునల్ ను ఆశ్రయించినట్లు వార్తలు వచ్చాయి . తాజాగా జూనియర్ టీమ్ ప్రకటనతో అది అంతా ట్రాష్ అని తేలిపోయింది.