పిక్ టాక్: చీరకే అందమొచ్చిందే..

అచ్చ తెలుగు అమ్మాయిలా చీరకట్టులో మెరిసిపోయిన ఆశికను థియేటర్లో చూడ్డానికి రెండు కళ్లు చాల్లేదు. ఈ అమ్మాయిలో ఇంతందం ఉందా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇక అప్పట్నుంచి ఆశికా సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం మొదలుపెట్టింది. ఆమె ఫొటోలు కనిపిస్తే చాలు.. ఫోల్డర్లలో సేవ్ చేసి పెట్టేస్తున్నారు కుర్రాళ్లు. తన అందం మరింత ఎలివేట్ అయ్యే ట్రెడిషనల్ డ్రెస్సుల్లోనే ఎక్కువగా ఫొటో షూట్లు చేస్తుంటుంది ఆశిక. తాజాగా ఆమె ఒక సింపుల్ చీరలో ఫొటోలు వదిలింది. ఎంత చూసినా తనివి తీరనట్లుగా.. చీరకే అందం తెచ్చినట్లుగా కనిపిస్తోంది ఆశిక ఈ ఫొటోల్లో. మరి అందాన్ని మున్ముందు టాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఎంతమేర ఉపయోగించుకుంటారో?