డీప్‌ఫేక్ వీడియోలు ప్రముఖులను కలవరానికి గురి చేస్తున్నారు. ఈ బాధితుల్లో ప్రధాన మంత్రి నుంచి క్రీడాకారుల వరకు.. చివరకు నటుల వరకు ఎవరినీ ఫేక్ మాయగాళ్లు వదిలి పెట్టడం లేదు. కృత్రిమ మేథ సాయంతో రూపొందిస్తున్న ఈ డీప్ ఫేక్ వీడియోలపై సర్వాత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి సంబంధించిన డీప్ పేక్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఓ బెట్టింగ్ యాప్‌ను కోహ్లీ ప్రమోట్ చేస్తున్నట్లు ఈ వీడియోలో ఉండటం గమనార్హం.
విషయం ఏంటంటే..
ఓ టీవీ ఛానల్ లైవ్ న్యూస్ కార్యక్రమంలో ‘కోహ్లీ యాడ్’ను ప్రసారం చేసినట్లు సైబర్ కేటుగాళ్లు ఈ వీడియోను సృష్టించారు. గతంలో కోహ్లీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్‌ను మార్ఫింగ్ చేసి.. బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు రూపొందించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించవచ్చో కోహ్లీ చెబుతున్నట్లుగా రూపొందించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. అయితే.. దీనిపై కోహ్లీ ఇంకా స్పందించలేదు.
సెలబ్రిటీలే లక్ష్యంగా
డీప్ ఫేక్ వీడియోల బారిన పడుతున్న వారిలో దాదాపు అందరూ సెలబ్రిటీలే ఉండడం గమనార్హం. ఇటీవల మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఓ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు నకిలీ వీడియో వైరల్ అయింది. అయితే.. నిముషాల వ్యవధిలోనే ఆయన తెరమీదికి వచ్చిన అది తనది కాదని.. ఏఐతో సృష్టించారని.. దీనిని నమ్మి మోసపోవద్దని ఆయన హెచ్చరించారు. వీడియోలో ఉన్నది తాను కాదంటూ స్పష్టతనిచ్చారు.
సర్వత్రా ఆందోళన..
ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) టెక్నాలజీని ఇలా విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వీడియోలు, ప్రకటనలు, యాప్‌లు ఎక్కడ కనిపించినా..చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనిపై సీరియస్ అయింది. సామాజిక మాధ్యమాలు అప్రమత్తంగా ఉంటూ ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని కూడా కేంద్రం కొన్ని సూచనలు చేసింది. నకిలీ సమాచారం, డీప్‌ఫేక్ వీడియోల వ్యాప్తిని అరికట్టేందుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటామని కూడా గత ఏడాది ప్రకటించింది.
వీరంతా బాధితులే..
- క్రికెట్ దిగ్గజం సచిన్ కుమార్తె సారా టెండూల్కర్
- సినీ తారలు రష్మిక, కత్రినాకైఫ్ మార్ఫింగ్ వీడియోలు
- ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గార్భా నృత్యాలు