బ్రహ్మచారి భక్తుడికి అయోధ్య ట్రస్టు ఆహ్వానం

అయోధ్యలో రామాలయం కోసం ఎంతమంది ఎన్నో త్యాగాలు చేశారు. కష్టాలు అనుభవించారు. భారీ శపధాలు చేశారు. అలాంటి వారికి సంబంధించిన ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన రవీంద్ర గుప్తా ఉదంతం ఈ కోవకే వస్తుంది. అతగాడు అయోద్యలో రాముడి గుడి కోసం భారీ శపధాన్నే తీసుకున్నాడు. అయోధ్యలో రామాలయం నిర్మించే వరకు తాను పెళ్లి చేసుకోకూడదని.. బ్రహ్మచారిగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు.

అందుకుతగ్గట్లే అతను పెళ్లి చేసుకోలేదు. 1992 డిసెంబరు 6న అతను శపధం తీసుున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు పెళ్లి చేసుకొని అతను.. ఒంటరిగా ఉండిపోయి బాబాగా మారిపోయాడు. ఇప్పుడు అతన్ని భోజ్ పలి బాబాగా వ్యవహరిస్తుంటారు. తాజాగా రామాలయ నిర్మాణం పూర్తి చేసుకొని.. జనవరి 22న ఆలయాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో రవీంద్ర గుప్తాకు అయోధ్య ట్రస్టు నుంచి ఆహ్వానం అందింది.

విశ్వహిందూ పరిషత్ లో సభ్యుడిగా ఉన్న రవీంద్ర.. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగే వరకు తాను పెళ్లి చేసుకోనన్న మాట మీదనే నిలిచారు. తాజాగా మాత్రం రాముడికే తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ తరహా భక్తుల్ని గుర్తించి మరీ.. అయోధ్య ట్రస్టు రామాలయ ప్రారంభానికి ఆహ్వానాల్ని పంపుతోంది.