ఇప్పటి జనరేషన్ కు పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. మీరు నలభై.. నలభై ప్లస్ అయితే మాత్రం జగతిబాబు హీరోగా నటించిన శుభలగ్నం మూవీ గుర్తుండే ఉంటుంది. డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చిన ఆ మూవీ సంచలన విజయాన్ని సొంతం చేసుకోవటమే కాదు.. జగతిబాబును ఫ్యామిలీ ఆడియన్స్ కు.. ముఖ్యంగా మహిళలకు దగ్గర చేసిందా మూవీ. ఈ సినిమాలో హీరోను హీరోయిన్ మరో అమ్మాయికి అమ్మేయటం.. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మూవీ.
ఆ సినిమా ముచ్చటను పక్కన పెడితే.. అచ్చం ఆ సినిమాలో మాదిరే.. తన భర్తను వేరే మహిళకు అమ్మేసిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. రోటీన్ కు భిన్నంగా చోటు చేసుకున్న ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. మాండ్ంయకు సమీపంలోని ఒక గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో.. తన భర్త స్థానికంగా ఉన్న ఒక మహిళకు సన్నిహితంగా ఉంటున్న విషయాన్ని గుర్తించింది.
వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సందర్భంలో చూసింది. ఈ సందర్భంగా వారిని నిలదీసింది. తప్పుడు పనులు చేస్తారా? అంటూ ప్రశ్నించింది. దీంతో.. ఇద్దరు ఆడవాళ్ల మధ్య జరిగిన గొడవ.. చివరకు పంచాయితీకి వెళ్లింది. ఈ సందర్భంగా సదరు మహిళ.. ‘నీ భర్త నా దగ్గర రూ.5 లక్షలు అప్పు చేశాడు. ఆ మొత్తాన్ని చెల్లించి.. అతన్ని తీసుకెళ్లు’ అని చెప్పింది.
దీనికి స్పందించిన భార్య.. తనకు అలాంటి భర్త అక్కర్లేదని.. తనకే రూ.5లక్షలు ఇచ్చి అతన్ని ఉంచేసుకోవాలని చెప్పింది. దీంతో.. భార్య అడిగిన రూ.5లక్షల మొత్తాన్ని నెలలో సర్దుబాటు చేస్తానని చెప్పటం.. దానికి భార్య ఓకే అనటంతో హాట్ టాపిక్ గా మారింది. డబ్బులతో ముడిపడిన ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన గ్రామపెద్దలు సైతం అవాక్కు అయిన పరిస్థితి. సోషల్ మీడియాలో ఈ ఉదంతం వైరల్ గా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates