హైదరాబాద్ మహానగరంలో దారుణ ఉదంతం చోటు చేసుకుంది. గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు ఒక మైనర్ బాలిక (16)పై గ్యాంగ్ రేప్ నకు పాల్పడటం.. అది కూడా ఇంట్లోకి చొరబడి మరీ అత్యాచారానికి పాల్పడిన ఉదంతం షాకింగ్ గా మారింది. పట్టపగలు.. ఇంట్లోకి జొరబడి.. కత్తితో బెదిరింపులకు దిగి గ్యాంగ్ రేప్ చేయటం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బే తీసేలా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ లాల్ బజార్ కు చెందిన పదహారేళ్ల బాలిక తల్లిదండ్రులు ఇద్దరు మరణించారు. దీంతో.. తన సోదరుడితో కలిసి మీర్ పేటలోని కాలనీలోకి పదిహేను రోజుల క్రితం వచ్చారు. సమీప బంధువైన ఇంట్లో ఆశ్రయం పొందుతున్నారు. బాధిత మహిళ దిల్ షుక్ నగర్ లోని ఒక బట్టల షాపులో పని చేస్తుండగా.. ఆమె సోదరుడు ఫ్లెక్సీలు కట్టే పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం తొమ్మిది గంటల వేళలో బాధితురాలు తన సోదరుడు.. మరో ముగ్గురు చిన్నారులతో కలిసి ఇంట్లో ఉన్న వేళలో.. ఎనిమిది మంది ఒక్కసారిగా ఇంట్లోకి జొరబడ్డారు. వారిలో కొందరు గంజాయి మత్తులో ఉన్నట్లుగా చెబుతున్నారు.
అందులోని నలుగురు బాలిక మెడపై కత్తి పెట్టారు. బిల్డింగ్ లోని మూడో అంతస్తులోకి తీసుకెళ్లారు. మిగిలిన వారు ఇంట్లోనే ఉండి బాధితురాలి సోదరుడు.. మిగిలిన చిన్నారుల్ని బంధించి ఉంచారు. బాధితురాలికి పైగదిలోకి తీసుకెళ్లిన నిందితుల్లో ముగ్గురు.. కత్తితో బెదిరింపులకు దిగి.. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గట్టిగా కేకలు వేయటంతో పరారైనట్లుగా బాలిక బంధువులు చెబుతున్నారు. అయితే.. అత్యాచారానికి పాల్పడిన వారిలో కొందరు బాధితురాలు నివాసం ఉండే ఇంటి కిందన ఉండే వారని చెబుతున్నారు.
నిందితుల్లో కింది అంతస్తులో ఉండే టైసన్.. మంగళ్ హాట్ కు చెందిన రౌడీషీటర్ అబేద్ లాలాలు ఉన్నట్లుగా బాధితురాలి సోదరుడు వెల్లడించాడు. మరో ఇద్దరు కూడా అక్కడకు దగ్గర నివాసం ఉండే వారని చెబుతున్నారు. ఈ దారుణ ఉదంతం చోటు చేసుకున్న తర్వాత మీర్ పేట పోలీసుల్ని ఆశ్రయించగా.. వారు కేసు నమోదు చేశారు. ఈ ఉదంతాన్ని సీరియస్ గా తీసుకున్న రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఏడు టీంలను ఏర్పాటు చేసి.. నిందితుల్లో నలుగుర్ని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. పోలీసులు మాత్రం అరెస్టుల్ని కన్ఫర్మ్ చేయట్లేదు.
This post was last modified on August 22, 2023 11:30 am
ఎన్నికల ఫలితాలకు సంబంధించి తెర మీదకు వస్తున్న కొత్త లెక్కలు దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెర తీస్తున్నాయి. గతానికి…
2012 లో ఉప్పెన మూవీ తో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కృతి..శ్యామ్ సింగరాయ్,. బంగార్రాజు చిత్రాలతో వరుస హిట్స్…
భారత పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సహా..…
ఒకవైపు దేశాన్ని మరోవైపు ప్రపంచ దేశాలను కూడా కుదిపేస్తున్న అంశం… ప్రముఖ వ్యాపార వేత్త.. ప్రపంచ కుబేరుడు.. గౌతం అదానీ…
సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతోన్న ఐపీఎల్-2025 ఆక్షన్ సందర్భంగా కొందరు క్రికెటర్లు కాసుల పండగ చేసుకుంటున్నారు. అదే సమయంలో మరికొందరు…
పుష్ప 1లో సమంతా చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా మావా ఊహు అంటావా ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసిన…