చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అంటు ఆమధ్య కల్వకుంట్ల కవిత ఢిల్లీలో తెగ హడావుడి చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుండి తప్పించుకునేందుకే ప్రతిపక్షాల మద్దతుందని చూపించుకునేందుకు మాత్రమే కవిత హడావుడి చేశారని అప్పట్లోనే బాగా ప్రచారం జరిగింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం ఎందుకు టికెట్లు ఇవ్వటంలేదని విచిత్రమైన వాదన వినిపించారు. అప్పట్లో కవిత హడావుడి చేసి అందరు ఆశ్చర్యపోయారు. సీన్ కట్ చేస్తే సొంతపార్టీలోనే మహిళలకు టికెట్లు ఇప్పించుకోలేక చేతులెత్తేశారు.
రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోయే బీఆర్ఎస్ అభ్యర్ధులను కేసీయార్ ప్రకటించారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో 115 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేశారు. వీరిలో ఏడుగురు మహిళలకు మాత్రమే టికెట్లిచ్చారు. కవిత చేసిన డిమాండ్ ప్రకారం సొంతపార్టీ బీఆర్ఎస్ లోనే 33 శాతం రిజర్వేషన్ కల్పించలేకపోయారు. కవిత చేసిన డిమాండ్ ప్రకారం 33 శాతం రిజర్వేషన్లంటే 39 టికెట్లు మహిళలకు దక్కుండాలి.
దక్కాల్సిన టికెట్లకు ఇచ్చిన టికెట్లకు అసలేమైనా పొంతనుందా ? ఇతర పార్టీల్లో మహిళలకు టికెట్లివ్వాలని డిమాండ్ చేస్తున్న కవిత సొంతపార్టీలో ఎందుకు ఇప్పించుకోలేకపోయారు ? అంటే అప్పట్లో మహిళా రిజర్వేషన్ పేరుతో కవిత చేసిన హడావుడి అంతా ఉత్త డ్రామా అని తేలిపోయింది. బీఆర్ఎస్ అంటేనే కేసీయార్ సొంత ఆస్తికింద లెక్క. కేసీయార్ ఆస్తంటే కవిత ఆస్తిగానే అనుకోవాలి. ప్రైవేటుపార్టీలన్నీ పార్టీల అధినేతల సొంతఆస్తిగానే జనాలు భావిస్తున్నారు. మరి అలాంటపుడు సొంతపార్టీలోనే ఎందుకు మహిళలకు టికెట్లు ఇప్పించుకోలేకపోయారు ?
నిజానికి కొన్ని విషయాలు నినాదాలవరకు బాగానే ఉంటుంది. కానీ ఆచరణలోకి రావాలంటే జరిగేపనికాదు. ఎన్నో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. మగవాళ్ళతో పోటీ పడి నెగ్గుకు రాగలిగినంత సామర్ధ్యం ఉండే మహాళలు చాలా తక్కువమంది ఉంటారు. పురుషులతో పోటీపడలేరని తెలిసి ఏ పార్టీ అయినా మహిళలను పోటీలోకి దింపి దెబ్బతినేందుకు సిద్ధంగా ఉంటుందా ? పైగా ఈ ఎన్నిక కేసీయార్ జాతీయ రాజకీయాలకు మెట్టులాగ పనిచేస్తుంది. హ్యాట్రిక్ కొడితే జాతీయ స్ధాయిలో కేసీయార్ కొంత చెల్లుబాటవుతారు లేకపోతే అంతే సంగతులు.
This post was last modified on August 22, 2023 1:52 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…