హైదరాబాద్ లోని కోకాపేటలో గోదావరి వారి ‘‘ఇష్టా’’

అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలలో దక్షిణాది వంటకాలను వండి వార్చే ప్రముఖ రెస్టారెంట్ లలో ఒకటిగా ‘గోదావరి’ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఇరు తెలుగు రాష్ట్రాలలో ప్యూర్ వెజ్ కాన్సెప్ట్ రెస్టారెంట్ ‘ఇష్టా‘ను చాలాకాలం క్రితం ప్రారంభించింది. వినూత్న ఆలోచనలతో, విభిన్నమైన కాన్సెప్ట్‌లకు కేరాఫ్ అడ్రస్ గా మారి భోజన ప్రియులకు రుచికరమైన శాఖాహార వంటకాలను ‘ఇష్టా’ ఇష్టంగా వండి వారుస్తోంది.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి (హైటెక్ సిటీ) ప్రాంతంలో చాలాకాలం క్రితం ఏర్పాటూైన ‘ఇష్టా’ ఆ ప్రాంతవాసుల ప్రశంసలు పొందింది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లోని కోకాపేటలో ‘‘ఇష్టా’’ ప్రారంభం కానుంది (Best Vegetarian Restaurant in Hitech City).

8000 చదరపు అడుగుల సువిశాల స్థలంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటైన ‘ఇష్టా’ లో పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడి తమకు పసందైన అచ్చ తెలుగు శాకాహార వంటకాలను ఆరగించవచ్చు. రకరకాల పనుల మీద కోకాపేటకు వచ్చే వారికి రుచుకిరమైన వంటకాలను వడ్డించేందుకు ‘ఇష్టా’ సిద్ధమైంది. నిత్యం రద్దీగా ఉండే కోకాపేట ప్రాంతంలో “ప్యూర్ వెజ్” ప్లేస్ ను ఏర్పాటు చేసి భారీ మెనూతో పాటు ప్రామాణికమైన, ప్రత్యేకమైన, రుచికరమైన థాలీలను ‘ఇష్టా’ అందించనుంది.

‘ఇష్టా’ వ్యవహారాల నిర్వహణ బాధ్యతలను ‘గోదావరి’ టీంలో కీలక సభ్యుడైన జశ్వంత్ రెడ్డి చూస్తున్నారు. వెజ్ కాన్సెప్ట్ లో అపార అనుభవం, నైపుణ్యంతో కూడిన బృందం ‘ఇష్టా’కు ఉన్నాయని, తమ టీమ్‌తో ప్రపంచంలోని ఏ ప్రాంతంలో అయినా అచ్చ తెలుగు వంటకాలు అందించే ‘ఇష్టా’ ఫ్రాంచైజ్ ను ఓపెన్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. చట్నీల నుండి బిర్యానీల వరకు వెజ్ కాన్సెప్ట్ ను తయారు చేసి గ్లోబల్ బ్రాండ్ గా ఎదగాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు (Best Vegetarian Restaurant in Kokapet).

హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్, బెంగళూరులలో కూడా ఫ్రాంచైజీలు ఓపెన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. మరికొద్ది వారాలలో మరిన్ని ప్రాంతాలలో తమ రెస్టారెంట్ ను ఓపెన్ చేయబోతున్నామని యశ్వంత్ వెల్లడించారు.

భారతీయ మార్కెట్ లో గోదావరిని రెండు బ్రాండ్లుగా విభజించామని అన్నారు. యునైటెడ్ తెలుగు కిచెన్స్ (UTK), ఇష్టాతో భారతీయ మార్కెట్లోకి తాము ప్రవేశించామని అన్నారు. అచ్చ తెలుగు మాంసాహార వంటకాలను యూటీకేల ద్వారా అందిస్తున్నామని, పూర్తి శాకాహార వంటకాలను ఇష్టా ద్వారా అందిస్తున్నామని వెల్లడించారు. ఈ రెండు బ్రాండ్లు ఇరు తెలుగు రాష్ట్రాలలో విజయవంతంగా దూసుకుపోతున్నాయని అన్నారు.

‘‘ఈ రెండు కాన్సెప్ట్‌లు వేటికవే ప్రత్యేకమైనవని. ప్రపంచవ్యాప్తంగా తమకు చెఫ్‌లు, ఫ్రంట్ స్టాఫ్ మరియు మేనేజర్‌లతో కూడిన 10వేల మంది సభ్యుల బలమైన బృందం ఉంది. భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన కాన్సెప్టులు, వంటకాలు అందిస్తాం. ఫ్రాంచైజీ పెట్టేందుకు ఆసక్తి ఉన్నవారు  చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి లొకేషన్లు, కాన్సెప్టుల పనితో బిజీగా ఉన్నాం.’’ అని గోదావరి టీం సభ్యులు కౌషిక్ కోగంటి, తేజ చేకూరి అన్నారు.

హైదరాబాద్‌ లో ఉన్న, హైదరాబాద్ లో పర్యటించే శాకాహార ప్రియులంతా తప్పక సందర్శించవలసిన రెస్టారెంట్ ‘ఇష్టా’. శాకాహారాన్ని ఇష్టంగా తినేవారు ‘ఇష్టా’వంటి ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని కూడా తప్పకుండా ‘ఇష్ట’పడతారు.

ఇష్టా గురించిన మరిన్ని వివరాలు, సమాచారం, సందేహాల కోసం జశ్వంత్ ను సంప్రదించండి: ఫోన్: jaswanth@ishtaa.in

Ishtaa Kokapet:

ఇష్టా,

షాప్ నం:16&17,

టెర్మినల్ కాంప్లెక్స్, గండిపేట్ మెయిన్ రోడ్,

కోకాపేట, హైదరాబాద్

తెలంగాణ, ఇండియా-500075

ఫోన్: +91 80086 09966

భోజన ప్రియుల కోసం మా ‘ఇష్టా’లో ‘కష్ట’పడి చేసే నలభీమపాకం వంటి వంటకాలను మీరంతా ‘ఇష్ట’పడి ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం…

మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు !

Visit: www.ishtaa.in

Content Produced by: Indian Clicks, LLC