నిన్న రాత్రి డివై పాటిల్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన ఇండియా-ఆస్ట్రేలియా అమ్మాయిల రెండవ టి20 లో భారత జట్టు సూపర్ ఓవర్ లో 4 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు మూనీ (82), మెక్ గ్రాత్ (70) పరుగులతో అజేయంగా నిలవడంతో 20 ఓవర్లలో 187 పరుగుల భారీ స్కోరు సాధించింది.
చేధనలో భారత్ ఓపెనర్లు స్మృతి మందన (79), షెఫాలీ (34) అదిరిపోయే ఆరంభం ఇవ్వగా… మధ్య ఓవర్లలో ఆసీస్ జట్టు పుంజుకుంది. చివరి 4 ఓవర్లలో 46 పరుగులు కావాల్సి ఉండగా… రిచా ఘోష్ (26) తో చెలరేగా… వైద్య (15) పరుగులు చేసి చివరి బంతికి 5 పరుగులు అవసరం కాగా ఫోర్ కొట్టి మ్యాచ్ ను టై గా ముగించింది.
సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ కి భారత్ జట్టులో రిచా సిక్సర్ కొట్టి ఔట్ అయింది. మందన తన ఫామ్ కొనసాగించి ఒక 4, 6 కొత్తగా భారత్ 20 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరుపున హీలే మొదటి బంతినే బౌండరీ బాదింది కానీ తరువాత బంతికే ఔట్ అయింది. ఇక చివరికి సూపర్ ఓవర్ లో ఆస్ట్రేలియా 16 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ విజయంతో భారత్ 3 మ్యాచ్ ల టీ-20 సిరీస్ ను 1-1 తో సమం చేసింది.