వావిలేదు.. వరుస లేదు.. అంటారు కదా! దీనిని నిజం చేసింది ఓ మహిళ. అది కూడా ఎక్కడో కాదు.. మన కడపలోనే. సొంత అల్లుడి తమ్ముడితో సెక్సువల్ సంబంధం పెట్టుకుని.. మూడు నెలల గర్భం కూడా తెచ్చు కుంది. అంతేకాదు.. అతనేదో.. పెళ్లికి సిద్ధం కాగానే.. నేరుగా వెళ్లి.. “నేను ఉండగానే పెళ్లి చేసుకుంటావా?” అని ప్రశ్నిస్తూ.. కత్తితో పొడిచి చంపింది!
క్రైం సీరియళ్లను, సినిమాలను కూడా తలదన్నేలా జరిగిన ఈ ఘటన.. మన కడప జిల్లాలోనే జరిగింది. ఇంతకీ ఎవరు? ఏంటి? అనే విషయం చూస్తే.. కడప జిల్లాలోని రాజుపాలెం మండల కేంద్రం. ఇక్కడ ఓ మహిళ(40-పేరు చెప్పడం బాగోదు)కు ఐదేళ్ల కిందటే భర్త చనిపోయాడు. ఈమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెకు పెళ్లీడు రావడంతో.. ఇంటి వెనుక వీధిలోని ఎస్సీ కాలనీకి చెందిన పెద్ద దస్తగిరికి ఇచ్చి రెండేళ్ల కిందట వివాహం జరిపింది.
ఈ మహిళ కూడా.. స్థానికంగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని నిర్వహిస్తోంది. అయితే, అనూహ్యంగా.. తన సొంత అల్లుడు పెద్ద దస్తగిరికి సొంత తమ్ముడు చిన్న దస్తగిరి(28) ఉన్నాడు.మరి ఎక్కడ కుదిరిందో.. ఎలా కుదిరిందో తెలియదు కానీ.. ఆ మహిళ(అంటే.. దస్తగిరి సొంత అత్త)కు చిన్న దస్తగిరికి సెక్సువల్ రిలేషన్ పెరిగింది. దాదాపు ఏడాదిన్నరగా ఈ తంతు సాగుతూనే ఉంది. ఎవరికి అనుమానం కూడా రాలేదు.
అయితే, వయసులో ఉన్న చిన్నదస్తగిరికి అన్న, వదిన(సదరు మహిళ కుమార్తె, అల్లుడు) పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇటీవల నిశ్చితార్థం కూడా పెట్టుకునేందుకు రెడీ అయ్యారు. అయితే.. ఈ విషయం తెలిసిన సదరు మహిళ.. నేరుగా అల్లుడి ఇంటికి వచ్చి నేనుండగా వేరేవారిని ఎలా పెళ్లి చేసుకుంటా
వంటూ చిన్నదస్తగిరితో వాగ్వాదానికి దిగింది.
ఆవేశంతో కత్తి తీసుకుని చిన్నదస్తగిరిని పొడవటంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు చేయించిన పరీక్షల్లో.. సదరు మహిళ గర్భిణీ అని తేలడం గమనార్హం.
This post was last modified on December 12, 2022 7:21 am
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్‌కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్‌లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…