Trends

బరువు తగ్గే ఔషధం వేసుకుంటే జుట్టు ఊడిపోతుంది

అదేంటో గానీ… ఉన్న రోగానికి మందేస్తే… ఆ రోగం సంగతేమో గానీ… కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా పరిణామాలు ఇటీవలి కాలంలో వేగంగా పెరుగుతున్నాయి. ఊబకాయం తగ్గేందుకు వాడే ఒజెంపిక్ ఔషధం కారణంగా నిన్నటిదాకా ఒజెంపిక్ ఫేస్ సంక్రమిస్తే… తాజాగా ఇదే ఔషధం వల్ల ఒజెంపిక్ హెయిర్ అన్న కొత్త సమస్య వెలుగులోకి వచ్చింది. వెరసి ఈ మందుల వినియోగంపై సర్వత్రా ఆంధోళన నెలకొంటోంది. ఉన్న రోగానికి మందేస్తే… కొత్త రోగం వచ్చి పడుతోందని సదరు మందును వాడుతున్న వారు డైలమాలో పడిపోతున్నారు. 

ఊభకాయం ఇప్పుడు విశ్వవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యే. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు జనం లెక్కలేనన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బరువు తగ్గించేందుకు వాడుతున్న మందుల్లో మౌంజారో, వెగోనీలతో పాటు ఒజెంపిక్ బాగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ఈ మందుల వినియోగంతో ఊబకాయం అయితే బాగానే తగ్గుతోంది. అయితే ఒజెంపిక్ వాడిన వారు బరువు తగ్గే క్రమంలో ఉత్తమ ఫలితాలను త్వరితగతిన పొందుతున్నారట. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడుతోంది.

శారీరక శ్రమ కారణంగా ఊబకాయం తగ్గితే మంచిదే. అలా కాకుండా ఔషధాలతో బరువు తగ్గాలనుకుంటే… కొంతమేర దుష్పలితాలు తప్పవు కదా. అదే తగ్గే క్రమం మరింత వేగంగా నమోదు అయితే ఆ పరిణామాలు మరింత దారుణంగా ఉంటాయి. ఇలా బరువు తగ్గేందుకు ఒజెంపిక్ వాడుతున్న వారిలో బరువు.. వేగంగా తగ్గిపోతోంది. అదే సమయంలో వారి ముఖాల్లో వార్థక్య లక్షాణాలు కనిపిస్తున్నాయి. ఈ తరహా పరిస్థితిని ఒజెంపిక్ ఫేస్ గా పిలుస్తున్న సంగతి తెలిసిందే. అంటే… వేగంగా బరువు తగ్గడం కోసం ఒజెంపిక్ వాడే వారి ముఖాలు ముసలితనంతో దర్శనమిస్తున్నాయన్న మాట.

ఇక ఇదే ఒజెంపిక్ మందు కారణంగా ఇప్పుడు బరువు తగ్గడంతో పాటు ముఖంలో వార్థక్య లక్షణాలు… వాటికి అదనంగా జుట్టు వేగంగా రాలిపోతోందట. ఈ సమస్యను శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒజెంపిక్ హెయిర్ గా పిలుస్తున్నారు. ఒజెంపిక్ వాడుతున్న వారు బరువు వేగంగానే కోల్పోతున్నారట. ఈ క్రమంలో వారికి ఆకలి కూడా మందిగిస్తోందట. వెరసి జుట్టు ఆరోగ్య పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్, ఐరన్, బయోటిన్, జింక్ లోపిస్తున్నాయట. ఈ పోషకాల లేమి కారణంగా సదరు వ్యక్తుల్లో జుట్టు వేగంగా రాలిపోతోందట. మరి ఈ సమస్యకు ఏ తరహా పరిష్కారం లభిస్తుందోనన్న దిశగా చర్చలు జరుగుతున్నాయి. 

This post was last modified on August 2, 2026 1:26 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

3 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

3 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

4 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

11 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

12 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

14 hours ago