హరీష్ శంకర్ మాస్టర్ స్ట్రోక్

పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ కొత్త సినిమాకు అనుకున్నట్లే ఈ రోజు ప్రారంభోత్సవం జరిగింది. ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొన్ని రోజుల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఉద్యమమే చేస్తున్నారు. వాళ్లందరికీ ఈ రోజు రిలీజ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ దిమ్మదిరిగే షాకిచ్చింది. ఈ టైటిల్, పోస్టర్ చూసి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే వారు ఈ సినిమా విషయంలో ఊహించింది వేరు. ఈ రోజు చిత్ర బృందం ఇచ్చిన అప్‌డేట్ వేరు.

ఇంతకుముందు ప్రకటించిన ‘భవదీయుడు భగత్‌సింగ్’ను పక్కన పెట్టి తమిళ హిట్ ‘తెరి’ని హరీష్-పవన్ రీమేక్ చేస్తున్నట్లు అందరూ భావించారు. సోషల్ మీడియా ప్రచారం అంతా ఇలాగే సాగింది. మరి ఈ చిత్రానికి ఏం టైటిల్ పెడతారు.. పవన్‌ను ఎలా చూపిస్తారు అనే విషయంలో రకరకాల చర్చలు జరిగాయి.

కానీ హరీష్ శంకర్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అంటూ కొత్త టైటిల్‌తో పోస్టర్ రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్ చూస్తే అందరికీ ‘భవదీయుడు భగత్ సింగ్’యే గుర్తుకొస్తోంది. టైటిల్ సౌండ్ అలాగే ఉంది. పోస్టర్లోనూ పోలికలు కనిపిస్తున్నాయి. This time Its not just entertainment అంటూ ఇంతకుముందు ‘భవదీయుడు భగత్‌సింగ్’ పోస్టర్ మీద ఉన్న క్యాప్షనే ఇందులోనూ కనిపించింది. ముందు అనుకున్న కథనే తీస్తుంటే టైటిల్ ఎందుకు ప్రకటించారన్నది అర్జం కాని విషయం.

చాలామంది హరీష్ తీస్తున్నది ‘తెరి’ రీమేకే అని.. కానీ టైటిల్, ఫస్ట్ పోస్టర్, క్యాప్షన్ విషయంలో మాత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’ టచ్ ఇచ్చాడని అంటున్నారు. ‘తెరి’ రీమేక్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న నెగెటివ్ క్యాంపైన్‌కు బ్రేక్ వేయడానికే హరీష్ ఇలా చేసినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఒక రకంగా పవన్ ఫ్యాన్స్‌కు హరీష్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్‌గా చెప్పొచ్చు. ప్రస్తుతానికి పోస్టర్ ద్వారా ఇది ‘తెరి’ రీమేక్ అన్న సంకేతాలు ఏమీ లేవు కాబట్టి.. ఇప్పటిదాకా చేస్తున్న నెగెటివ్ క్యాంపైన్‌ను కొనసాగించలేరు. అలా అని ఇది కొత్త కథ అని ధీమాగా ఉండలేరు. ఆ అనుమానాలున్నా అలాగే కొనసాగుతాయి కానీ సినిమా రిలీజయ్యే దాకా సైలెంటుగా ఉండాల్సిందే.

This post was last modified on December 12, 2022 7:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆస్ట్రేలియాలో 4వ ఫైట్.. టీమిండియాకు మరో షాక్!

ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…

29 minutes ago

బన్నీ చేసిన తప్పు.. చేయని తప్పు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…

38 minutes ago

అండర్-19 అమ్మాయిలు అదరగొట్టేశారు!

అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీ…

38 minutes ago

గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన సుక్కు!

అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…

49 minutes ago

#NTR31 : ఎలాంటి జానరో చెప్పేసిన నీల్!

ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…

1 hour ago

‘ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం ఇండ‌స్ట్రీ పై జరుగుతున్న కుట్ర‌’

కేంద్ర మంత్రి, తెలంగాణ‌ బీజేపీ నాయ‌కుడు బండి సంజ‌య్ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…

1 hour ago