ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని బీహార్ లోని ఒక జంట మళ్ళీ నిరూపించింది. 42 ఏళ్ల ప్రొఫెసర్ ను 20 ఏళ్ల యువతి పెళ్లి చేసుకోవడం బీహార్ లోని సమస్తిపూర్ లో ప్రత్యేకంగా నిలిచింది. ఈ ప్రేమ జంట కలయిక మతుక్ నాథ్ – జూలీ ల ప్రేమ కథను తలపించింది.
వివరాలకు వెళ్తే.. ఈ 42 ఏళ్ల ప్రొఫెసర్ ఇంటి వద్ద ఇంగ్లీష్ కోచింగ్ క్లాసులు నడుపుతుంటాడు. తన వద్ద కోచింగ్ కోసం వచ్చిన 20 ఏళ్ల యువతి తో అతను ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ హాయిగా చెట్టాపట్టాలేసుకొని కొన్ని రోజులు తిరిగిన తరువాత గురువారం ఒక గుడిలో ఏకంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి మండపంలో పవిత్ర అగ్ని చుట్టూ ఏడడుగులు వేస్తూ ఉన్న ఈ జంటకు సంబంధించిన వీడియో బయటకు వచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఇద్దరి ఇళ్ళ మధ్య దూరం 800 మీటర్లు మాత్రమే. మరి తల్లిదండ్రుల అనుమతితో వీరు పెళ్లి చేసుకున్నారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. తనకంటే వయసులో దాదాపు 22 ఏళ్ల చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఈ ప్రొఫెసర్ కు ముందే పెళ్లయింది కానీ చాలా ఏళ్ళ క్రితమే అతని భార్య చనిపోయింది. ఇక వీరిద్దరి ప్రేమ కథ ఎంతో సంచలమైన మతుక నాథ్, జూలీల ప్రేమ కథను గుర్తుతెచ్చిందని స్థానికులు చెబుతున్నారు.
https://twitter.com/kumarprakash4u/status/1601462871564898304?s=20&t=6MQsc3i2cN9kLyp1eze9Gg
Gulte Telugu Telugu Political and Movie News Updates