viral video : సోషల్ మీడియా బాగా పాపులర్ అయినప్పటి నుండి ఎవరికి వారు తమ ప్రత్యేకతను చాటుకోవడానికి ఈ మాధ్యమాన్ని వినూత్నంగా ఉపయోగిస్తున్నారు. అయితే కొంతమంది వికృతి చేష్టలు అప్పుడప్పుడు పబ్లిక్ కు ఇబ్బందిగా తయారవుతూ ఉంటాయి. అలాంటి వారు దీనిని ట్రెండ్ అంటారు కానీ కొన్నిసార్లు సమస్యల పాలు అవుతుంటారు అనుకోండి అది వేరే విషయం.
ఇక విషయానికి వస్తే… ఢిల్లీకి చెందిన ఒక యువకుడు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఒక కొత్త ప్రయత్నమే చేశాడు. మోహిత్ గౌహర్ కు సోషల్ మీడియాలో లక్షల ఫాలోయర్స్ ఉన్నారు. ఎన్నోకొత్త వీడియోలు ట్రై చేసిన అతను తాజాగా ఒక వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఢిల్లీ మెట్రోలో అతను బనియన్, టవల్ తో ప్రయాణించడం విశేషం. అక్కడ ఉన్న జనాలందరికీ మెట్రోలో ఇలా దర్శనం ఇవ్వడమే కాకుండా క్యాట్ వాక్ చేస్తూ చేతులు ఊపుతూ రచ్చ రచ్చ చేశాడు.
Viral Video :
రైలు అద్దాలతో అందాన్ని చూసుకొని మురిసిపోతూ వైరల్ అయిపోయాడు. కొంతమంది దీనిని చూసి ఎంజాయ్ చేయగా మరికొందరు మాత్రం మండిపడ్డారు. పబ్లిక్ ప్లేస్ లో ఇలాంటి చేష్టలు ఏంటి అంటూ ఆగ్రహం వెళ్ళబుచ్చిన వారు కూడా ఉన్నారు. మొత్తానికి ఇతనికి కావలసిన ఫాలోయర్స్ వచ్చేశారు వీడియో తెగ వైరల్ అయిపోయింది. ఖేల్ ఖతం… దుకాణం బంద్!
Gulte Telugu Telugu Political and Movie News Updates