మీరు చదివింది అక్షరాల నిజం. ఒక్క డాలర్ కు పిజ్జానే రాదు. అలాంటిది ఏకంగా ఇల్లు ఇచ్చేయటమేనా? అన్న ఆశ్చర్యం అక్కర్లేదు. ఒక భారీ మిషన్ కోసం ఒక దేశ సర్కారు తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. అదిరిపోయే ఆఫర్లకు పరిమితులు ఉన్నట్లే.. ఒక్క డాలర్ కే ఇల్లు సొంతం చేసుకోవాలంటే కొన్ని నిబంధనల్ని పాటించాల్సి ఉంటుంది. ఇంతకీ.. ఇంత కారుచౌకగా ఇంటిని డాలర్ కే ఇచ్చే దేశం ఎక్కడ ఉంది? అందుకు విధించిన నిబంధనలు ఏమిటన్న విషయంలోకి వెళితే..
దేశం ఏదైనా కానీ.. అవసరాల కోసం.. ఊళ్లను వదిలేసి పట్టణాలకు.. నగరాలకు పయనం కావటం తెలిసిందే. ఈ సమస్య ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఉంది. అందుకు ఇటలీ సైతం మినహాయింపు కాదు. పట్టణాలకు వెళ్లే ప్రజలు గ్రామాల్ని పట్టించుకోవటం మానేశారు. దీంతో.. ఊళ్లలో ఉన్న ఇళ్లను వదిలేసి.. పట్టణాలు.. నగరాల్లో సెటిల్ అయిపోతున్న తీరుతో.. ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. అక్కడి పాతకాలం ఇళ్లు పాడుపడిపోతున్నాయి. దీంతో.. ఈ సమస్యను అధిగమించేందుకు ఇటలీ ప్రభుత్వం వినూత్నమైన ఆలోచన చేసింది. దీని ప్రకారం.. నిర్మానుష్యంగా ఉండే ఊళ్లను కళకళలాడేలా చేయటం కోసం సరికొత్త పథకాన్ని తెర మీదుకు తీసుకొచ్చారు.
పట్టణాలకు వెళ్లే క్రమంలో గ్రామాల్ని నిర్లక్ష్యం చేసే ప్రజల తీరుకు నిదర్శనంగా ఇటలీలోని చింక్వా ఫ్రాండీ అనే గ్రామం ఉంది. ఇక్కడి వారంతా ఊరును వదిలేసి.. పట్టణాలకు వెళ్లిపోవటంతో ఇళ్లు పాడుబడిపోతున్నాయి. దీంతో.. ఆ గ్రామంలోని ఖాళీగా ఇళ్లను అక్కడి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వాటిని ఒక్క డాలర్ కే అమ్ముతానని ప్రకటన చేసింది. అయితే.. ఇంత కారుచౌకగా కొనే వారికి కొన్ని నిబంధనల్ని పెట్టింది.
ఒక్క డాలరుకే ఇంటిని సొంతం చేసుకునే వారు.. ఆ ఇంట్లోనే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఇంటిని సొంతం చేసుకున్న వారు సదరు ఇంటిని బాగు చేసుకోవాలి. లేదంటే.. తిరిగి కట్టుకోవాలి. అలా చేసే వరకు ఏడాదికి సుమారు రూ.21వేల వరకు బీమా చేసుకోవాలి. ఒకసారి ఇల్లు బాగు చేసుకున్న తర్వాత బీమాను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
ఒకవేళ మూడేళ్ల వ్యవధిలో ఇంటిని బాగు చేసుకోకపోతే మాత్రం రూ.17లక్షల మొత్తాన్ని ఫైన్ గా కట్టాల్సి ఉంటుంది. ఆపరేషన్ బ్యూటీ పేరుతో స్టార్ట్ చేసిన ఈ పథకం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఒకవేళ.. తాము అనుకున్నట్లుగా ఈ పథకం వర్క్ వుట్ అయితే.. మరిన్ని గ్రామాలకు ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. గ్రామాల్ని మళ్లీ కళకళలాడేలా చేయటంలో ఆపరేషన్ బ్యూటీ కీలకంగా మారుతుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మరి.. దీనికి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on July 16, 2020 10:38 am
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…