అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఆటా, వారి ఆధ్వర్యంలో విస్కాన్సిన్ రాష్ట్రంలో ఆటా మిల్వాకీ టీం శనివారం సెప్టెంబర్ 10 వ తారీఖున ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల గారి చేతుల మీదుగా ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. మంగళ వాద్యాలతో ఆహ్వానం పలికి ఆటా టీం సబ్యులని ఘనంగా సత్కరించారు. సాండ్ వాలీ బాల్ టోర్నమెంట్ నిర్వహించారు, 12 పైగా వాలీ బాల్ టీమ్స్ పాల్గొన్న ఈ కార్యక్రమం లో లెవెల్ 1 లో NB కింగ్స్ టీం విజేతలుగా నిలవగా వైకింగ్ వారియర్స్ టీం రన్నర్ అప్ గా నిలిచారు. లెవెల్ 2 విన్నెర్స్ గా NB రైడర్స్, NB గల్లీ బాయ్స్ నిలిచారు.
మేళ తాళాలతో ఎంతో అట్టహాసంగా నిర్విహించిన కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందచేశారు. న్యూ బెర్లిన్ తెలుగు వారు ఇంటిలో వండిన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేసారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు ౩౦౦ మందికి పైగా పాల్గొన్నారు. మహిళలు పిల్లలు సందడి చేసారు.
ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల మాట్లాడుతూ ఆటా కార్యక్రమాల గురించి వివరించారు, మహిళలు సమాజ సేవలో విరివిగా పాల్గొనాలి అని పిలుపునిచ్చారు. ఆటా మిల్వాకీ టీం ఏర్పాటుకు చురుకైన పాత్ర పోషించిన చంద్ర మౌళి సరస్వతి రీజినల్ కోఆర్డినేటర్ గా, పోలిరెడ్డి గంట రీజినల్ డిరెక్టర్ గా నియమించారు. ఆటా సెక్రటరీ హరి ప్రసాద్ రెడ్డి లింగాల, ఆటా కోశాధికారి సాయినాథ్ రెడ్డి బోయపల్లి, ఆటా బోర్డు అఫ్ ట్రస్టీ మెహెర్ మేడవరం మిల్వాకీ టీం ఏర్పాటుకు సహకారం అందించారు.
చంద్ర మౌళి ఆటా చికాగో టీం సభ్యులకు ఈ కార్యక్రమం నిర్వహించటానికి ప్రోత్సాహం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పోలిరెడ్డి మాట్లాడుతూ ఆటా కార్యవర్గానికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని ప్రకటించారు. పోలిరెడ్డి సహచర సభ్యులు కరుణాకర్ రెడ్డి దాసరి, వెంకట్ చిగురుపాటి, దుర్గ ప్రసాద్ రబ్బ, వంశి ఎదపై, శ్రీకాంత్ కురుమద్దాలి, జగదీశ్ కట్ట, వినోద్ కుమార్ కాచినేని, అనిల్ వెంకటప్పాగారి, జయంత్ పర, లక్ష్మి రెడ్డి పెద్దగోర్ల, గంగాధర్ నల్లూరి, గోపాల బలిపురా, నారాయణస్వామి, ఫణి గారపాటి, శరత్ పువ్వాడి, లక్సమం ప్రసాద్ జయంత్, సత్య జగదీశ్ బాదాం, చంద్ర శేఖర్ ఈ కార్యక్రమం నిర్వహించటంలో సహకారం కొనియాడారు.
CLICK HERE!! for Photo Gallery.
Content Produced by Indian Clicks, LLC
Gulte Telugu Telugu Political and Movie News Updates