తిరుమలకు వెళ్తారా.. ఈ వార్త చూడండి

Tirumala

లాక్ డౌన్ వేళ అన్ని కార్యకలాపాలూ ఆగిపోెయాయి. దేవాలయాలు, మసీదులు, చర్చిలు కూడా మూతపడ్డాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఉండే దేవాలయం అయిన తిరుమల కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మూడు నెలలల పాటు మూతపడింది. చివరికి గత నెలలో ఆ ఆలయాన్ని తెరిచారు. అనేక జాగ్రత్తల మధ్య భక్తులకు దర్శన భాగ్యం కనిపిస్తున్నారు.

కొందరు భక్తులు ధైర్యం చేసి తిరుమలకు వెళ్తుంటే.. చాలామంది భయంతో ఆలయ దర్శనానికి వెళ్తున్నారు. దర్శనాలకు అనుమతి ఉన్నా సరే.. పెద్దగా రద్దీ లేకుండా కనిపిస్తోంది తిరుమల. ఐతే ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా సరే.. తిరుమలలోనూ కరోనా విజృంభిస్తోంది. గత వారం రోజుల వ్యవధిలో అక్కడ 17 కేసులు బయటపడటం వైరస్ తీవ్రతను తెలియజేస్తోంది.

కొన్ని రోజుల కిందటే తిరుమలలో తొలిసారి కరోనా కేసు బయటపడింది. దీంతో సిబ్బందికి పరీక్షలు చేస్తూ వెళ్లగా మొత్తం 17 మంది వైరస్ బాధితులుగా తేలారు. దీంతో మొత్తం సిబ్బంది అందరికీ పరీక్షలు జరిపించాలని నిర్ణయించారు. రోజుకు వంద మంది చొప్పున స్వాబ్ పరీక్షలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. మరి ఈ కరోనా బారిన పడ్డ సిబ్బంది నుంచి భక్తులు ఎంతమందికి కరోనా సోకిందన్నది ప్రశ్న.

భక్తులు ఎడం పాటిస్తూ దర్శనాలకు వెళ్లాలని షరతులు విధించినప్పటికీ.. క్యూ లైన్లలో అంత క్రమశిక్షణ పాటించడం కష్టమే. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో దేవుడి మీద భారం వేసి శ్రీవారి దర్శనానికి వెళ్లడం మంచిది కాదనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కనీసం ఇంకో రెండు నెలల పాటు అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లడం, ప్రయాణాలు చేయడం, దైవ దర్శనాలకు వెళ్లడం ఆపితేనే మంచిదని హెచ్చరిస్తున్నారు.