రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ ఇద్దరు వ్యక్తులు ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఉదయ్‌పుర్‌లోని మల్దాస్ వీధిలో టైలర్ షాపు నిర్వహిస్తున్న కన్నయ్యలాల్‌ను ఇద్దరు వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేశారు. వినియోగదారు ల మాదిరిగా వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు కన్నయ్యపై కత్తితో దాడి చేయగా, మరో వ్యక్తి ఈ దృశ్యాలను వీడియో తీశాడు. హత్య అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి బైక్పై పారిపోయారు.
ఆ తర్వాత కాసేపటికి వీడియోనూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఉదయ్‌పూర్ సహా చుట్టుపక్కల ఉన్న రెండు మూడు జిల్లాల్లో 8 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. ఇక, ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. జోధ్‌పూర్ పర్యటనను రద్దు చేసుకుని జైపూర్‌కు తిరిగి వచ్చారు.
ఈ దారుణ హత్య నేపథ్యంలో పోలీసులు ఉదయ్‌పుర్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. దాదాపు ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. హత్యను సీరియస్గా తీసుకున్న కేంద్రం.. కేసును ఎన్ఐఏ అప్పగించింది. ఈ హత్య వెనుక అంతర్జాతీయ కుట్ర కోణం ఉందని కేంద్రం హోం శాఖ పేర్కొంది. ఈ కోణంలోనే దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించింది.
తీవ్ర ఉద్రిక్తత
టైలర్ కన్హయ్య లాల్ మృతదేహానికి స్థానిక మహారాణా భూపాల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతిధులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో భాజపా నేత గులాబ్‌చంద్ కటారియా ఎంబీ ఆస్పత్రికి చేరుకొని.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
కన్హయ్య లాల్ అంత్యక్రియలకు భారీగా ప్రజలు, ప్రజాపతినిధులు హాజరయ్యారు. మృతదేహాన్ని ప్రదర్శనగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా హత్యను ఖండిస్తూ.. బైక్ ర్యాలీ నిర్వహించారు. దోషులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు.
This post was last modified on June 29, 2022 6:18 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…