Movie News

సల్మాన్‌ను ఎలా ఒప్పించారబ్బా?

మన నిర్మాతలు ఈ మధ్య బౌండరీలు దాటేసి, వేరే ఇండస్ట్రీల సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు తమిళంలో అజిత్‌తో, హిందీలో సన్నీ డియోల్‌తో, మలయాళంలో టొవినో థామస్‌తో సినిమాలు చేశారు. దిల్ రాజు తమిళంలో విజయ్‌తో ‘వారిసు’ తీశారు. ఇలా పర భాష నుంచి వచ్చిన నిర్మాతలతో ఆయా ఇండస్ట్రీల స్టార్లు సినిమాలు చేయడానికి వారిని టెంప్ట్ చేస్తున్నది ప్రధానంగా పారితోషకమే కావడం గమనార్హం. 

అంతకుముందు సినిమాలకు వాళ్లు పుచ్చుకుంటున్న రెమ్యూనరేషన్‌ కంటే ఎక్కువ డబ్బులిచ్చి వాళ్లను సినిమాలకు లాక్ చేశారనే చర్చ ఆయా సందర్భాల్లో జరిగింది. ఇప్పుడు దిల్ రాజు హిందీలో సల్మాన్ లాంటి టాప్ స్టార్‌తో సినిమా చేస్తున్నాడంటే ఇదే మోడల్ ఫాలో అయిపోయి ఉంటాడని అంతా అనుకున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సల్మాన్ రికార్డు స్థాయిలోనే పారితోషకం అందుకుని ఉంటాడనే అభిప్రాయలు కలిగాయి.

కానీ ఆశ్చర్యకరంగా సల్మాన్ తన రెగ్యులర్ రెమ్యూనరేషన్ కంటే చాలా తక్కువ తీసుకుంటున్నాడట వంశీ-దిల్ రాజు సినిమాకు. వేరే సినిమాలకు రూ.120 కోట్ల మేర రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్న సల్మాన్.. ఈ సినిమాకు మాత్రం రూ.50 కోట్లు తగ్గించుకుని రూ.70 కోట్లే అందుకుంటున్నాడట. కెరీర్లో వరుస ఫ్లాపులు రావడం, మార్కెట్ దెబ్బ తినడానికి తోడు.. ఈ ప్రాజెక్టును సెట్ చేసింది తన క్లోజ్ ఫ్రెండ్ రఫీ కాజి కావడం కూడా సల్మాన్ పే కట్‌కు కారణమని తెలుస్తోంది. 

ఈ ప్రాజెక్టు సెట్ చేసినందుకు రఫీ కాజి కొంత వాటా తీసుకుని ఉంటారని, దీనికి తోడు తన మార్కెట్ దెబ్బ తిన్న నేపథ్యంలో నిర్మాతలను సేఫ్ చేయడం కోసం పారితోషకాన్ని సల్మాన్ తగ్గించుకుని ఉంటాడని భావిస్తున్నారు. గత ఏడాది సల్మాన్ నుంచి వచ్చిన ‘సికందర్’ దారుణమైన డిజాస్టర్ అయింది. ఆ తర్వాత సల్మాన్ నటించిన ‘మాతృభూమి’ విడుదలకే నోచుకోకుండా ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే తన కెరీర్‌కు ఎంతో కీలకమైన సినిమా విషయంలో సల్మాన్‌ రాజీ పడినట్లు తెలుస్తోంది.

This post was last modified on August 2, 2026 1:06 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

9 minutes ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

51 minutes ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

1 hour ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

1 hour ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

3 hours ago