ఎక్కడైనా.. ఏదైనా ప్రభుత్వం ఉద్యోగులతో పనిచేయించుకుని.. వారికి జీతాలు.. భత్యాల రూపంలో సొమ్ములు ఇస్తుంది. కానీ, ఏపీలో మాత్రం రివర్స్ జరుగుతోందని.. ఇక్కడి ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నా రు. ప్రభుత్వం తమను మరోమారు నమ్మించి, మోసం చేసిందనే వాదన ఉద్యోగ సంఘాల నుంచి వినిపి స్తోంది. డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలకు జమ చేసినట్లే చేసి, వెనక్కి తీసుకుందని చెబుతున్నారు. వ్యక్తిగత జీపీఎఫ్ ఖాతాల నుంచి తమ అనుమతి లేకుండా తీసుకోవడంపై ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు.
ప్రభుత్వం వెనక్కి తీసుకున్న డీఏ బకాయిలు సుమారు రూ.800 కోట్ల వరకు ఉంటాయని చెబుతున్నారు. రాష్ట్రంలో 90వేల మంది ఉద్యోగుల ఖాతాల నుంచి ఈ సొమ్ము మాయమైందని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటానికి వెనుకాడేది కూడా లేదని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఖాతాలో ఎవరైనా జమ చేయొచ్చు. విత్‌డ్రా చేసే అధికారం మాత్రం ఉద్యోగికే ఉంటుంది. ఉద్యోగుల అనుమతి లేకుండా ఇప్పుడు ప్రభుత్వం నిధులను తీసేసుకుంది. దీనిపైనా కొందరు ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు.
విత్‌డ్రా చేయడానికి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వనందున ఎలా ఫిర్యాదు చేయాలి? సీఎఫ్‌ఎంఎస్‌పై ఫిర్యాదు చేయాలా? అని సమాలోచనలు చేస్తున్నారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు జీపీఎఫ్ ఖాతాలకు సంబంధించిన వివరాల స్లిప్పులను ఏజీ కార్యాలయం ఆన్‌లైన్‌లో పెట్టింది. వాటిని డౌన్‌లోడ్ చేసుకుంటున్న ఉద్యోగులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. డీఏ బకాయిలను విడతల వారీగా జమచేసినట్లు స్లిప్పుల్లో ఉండగా.. గత మార్చిలో మొత్తం ఒకేసారి వెనక్కి తీసేసుకున్నట్లు ఉంది.
ఉద్యోగుల సర్వీసును అనుసరించి ఒక్కొక్కరి ఖాతాలో సుమారు రూ.60 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు జమ అయినట్లే అయ్యి, వెనక్కి వెళ్లిపోయాయి. గత మార్చిలోనే కొంతమంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు వెనక్కి వెళ్లిపోయినట్లు సెల్‌ఫోన్లకు సమాచారం వచ్చింది. అప్పట్లో దీనిపై ఆందోళనతో ఆర్థికశాఖకు ఫిర్యాదులు చేశారు. కానీ, జీపీఎఫ్ ఖాతాకు సంబంధించి ఆర్థిక సంవత్సరం పూర్తి వివరాల స్లిప్పులు రాకపోవడంతో కొందరు దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు స్లిప్పులు చూసుకున్నవారు ఆందోళన చెందుతున్నారు.
గతంలో ఏం చెప్పిందంటే..
ప్రభుత్వం వెనక్కి తీసుకున్న డీఏ బకాయిలు సుమారు రూ.800 కోట్ల వరకు ఉంటాయి. రాష్ట్రంలో 90వేల మంది ఉద్యోగుల ఖాతాల నుంచి ఈ సొమ్ము మాయమైంది. 2018 జులై నుంచి 2020 డిసెంబరు వరకు, 2019 జనవరి నుంచి 2021 జూన్ వరకూ ఉన్న డీఏ బకాయిలను వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొంది. 2021 ఏప్రిల్ నుంచి 2022 జనవరి వరకు అయిదు విడతలుగా జీపీఎఫ్ ఖాతాలకు జమచేసింది. మార్చిలో ఒకేసారి ఆ మొత్తాన్ని వెనక్కి లాగేసింది.
ఇది ఉద్యోగుల వాట్సప్ గ్రూపుల్లో హల్‌చల్ చేసింది. ప్రభుత్వ చర్యలపై ఉద్యోగులు మండిపడుతున్నారు. డీఏ బకాయిల్లో సీపీఎస్ ఉద్యోగులకు 90% నగదు, 10% సీపీఎస్ ఖాతాలకు జమచేయాల్సి ఉండగా.. దీన్ని పట్టించుకోవడం లేదు. కొంతకాలంగా సీపీఎస్ ఉద్యోగులు ఎన్ని వినతులు ఇచ్చినా ఎలాంటి చెల్లింపులు చేయడం లేదు. పదవీవిరమణ చేసిన వారికి నగదు రూపంలో ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వడం లేదు. అలా ఇవ్వకపోగా.. ఇప్పుడు జీపీఎఫ్ ఖాతాల్లో జమచేసిన మొత్తాన్నీ ప్రభుత్వం తీసేసుకోవడంపై తీవ్ర స్థాయిలో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on June 29, 2022 12:48 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…