డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ ఫ్యాన్స్‌కు షాక్

Under Taker Quits WWE

వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ ఎంట‌ర్టైన్మెంట్.. షార్ట్‌గా డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ.. ఈ పేరెత్తితో కోట్లాది మంది అభిమానులు వెర్రెత్తిపోతారు. ఎంతో నాట‌కీయంగా సాగే ఆ ఫైట్లంటే ప‌డిచ‌చ్చే వాళ్లు కోట్ల‌మంది ఉన్నారు. ఇందులో జ‌రిగేదంతా ముందే ప్లాన్ చేసి ఉంటార‌ని.. చాలా వ‌ర‌కు దొంగ ఫైట్లే అని తెలిసినా కూడా దాన్నో వ్య‌స‌నంగా మార్చుకున్న అభిమానులు విడిచిపెట్ట‌లేరు.

ఇందులో స్టార్ల‌కు ఉన్న డిమాండే వేరు. డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ అభిమానుల‌కు పెద్ద షాక్ త‌గిలింది. ఈ లీగ్‌ చ‌రిత్ర‌లోనే అత్యంత విజ‌య‌వంత‌మైన, అత్య‌ధిక పాపులారిటీ ఉన్న ఫైట‌ర్ల‌లో ఒక‌డిగా పేరున్న అండ‌ర్ టేక‌ర్ ఉన్న‌ట్లుండి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. కోట్ల‌మంది అభిమానుల్ని విచారంలోకి నెట్టేశాడు.

55 ఏళ్ల అండ‌ర్ టేక‌ర్ 33 ఏళ్ల పాటు డ‌బ్ల్యూడ‌బ్యూఈకి త‌న జీవితాన్ని అంకితం చేశాడు. అత‌డి కెరీర్లో ఎన్నో ఎత్తు ప‌ల్లాలు ఉన్నాయి. ముందు బాస్కెట్‌బాల్ క్రీడాకారుడైన అండ‌ర్‌టేక‌ర్‌.. త‌ర్వాత డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈలోకి వ‌చ్చాడు. వ‌చ్చీ రాగానే ఇందులో స్టార్ అయ్యాడు. చివ‌ర‌గా అత‌ను కేన్ ది అండ‌ర్ టేక‌ర్ పేరుతో బ‌రిలోకి దిగేవాడు.

స్వ‌త‌హాగా రైట్ హ్యాండ‌ర్ అయిన‌ప్ప‌టికీ.. లెఫ్ట్ హ్యాండ్ షాట్‌తో అత‌ను పాపులారిటీ సంపాదించాడు. స‌బ్‌మిష‌న్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని చ‌రిత్ర అండ‌ర్ టేక‌ర్‌ది. 2008లో అత‌ను ప్ర‌పంచ హెవీ వెయిట్ ఛాంపియ‌న్‌షిప్‌లో పోటీ ప‌డ్డ తొలి ఛాలెంజ‌ర్‌గా రికార్డు సృష్టించాడు.

త‌న కెరీర్‌కు ఇది అద్భుత‌మైన ముగింపు అని.. మ‌ళ్లీ తాను రింగ్‌లోకి పున‌రాగ‌మ‌నం చేస్తానో లేదో చెప్ప‌లేన‌ని అండ‌ర్‌టేక‌ర్ వీడ్కోలు సందేశంలో పేర్కొన్నాడు.