రష్యాకు ఊహించని షాక్

ఉక్రెయిన్ పై యుధ్ధానికి దిగిన రష్యాకు క్రీడా సమాఖ్యలు ఊహించని షాకులిస్తున్నాయి. చాలా క్రీడా సమాఖ్యలు రష్యాపై  నిషేధం విధిస్తున్నాయి. రష్యాలో జరగాల్సిన క్రీడల పోటీలు రద్దు చేసుకుంటున్నాయి. రష్యాలో జరగాల్సిన క్రీడలను రద్దు చేసుకోవాలని అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ అంతర్జాతీయ క్రీడల సమాఖ్యను కోరింది. ఇతర దేశాల్లో జరిగే అంతర్జాతీయ క్రీడల్లో రష్యా జెండాను ఎగరేయకూడదని, రష్యా జాతీయ గీతాన్ని పాడకూడదని ఇప్పటికే నిర్ణయం జరిగింది.

ఇక నుండి రష్యాలో అంతర్జాతీయ ఫుట్ బాల్ మ్యాచ్ లు జరగవని ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ అసొసియేషన్ తాజాగా నిర్ణయించింది. ప్రపంచకప్ క్వాలిఫైంగ్ మ్యాచుల నుండి రష్యాను బహిష్కరించాలని ఇంగ్లాండ్, జర్మనీ, పోలండ్, స్వీడన్, పోలండ్ డిమాండ్ చేస్తున్నాయి. రష్యా, బెలారస్ లో జరగాల్సిన అన్నీ బ్యాడ్మింటన్ మ్యాచులను రద్దు చేస్తున్నట్లు బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రకటించింది.

వచ్చే ఆగస్టులో రష్యాలో జరగాల్సిన జూనియర్ వరల్డ్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పోటీలను రద్దు చేసినట్లు వరల్డ్ స్విమ్మింగ్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. పురుషుల హాకీ వరల్డ్ కప్ పోటీల నుంచి రష్యాను బహిష్కరించాలని ఫిన్లాండ్ డిమాండ్ చేస్తోంది. రష్యా, బెలారస్ కు చెందిన స్పాన్సరర్లతో ఒప్పందాలు రద్దు చేసుకున్నట్లు అంతర్జాతీయ చెస్ సమాఖ్య ప్రకటించింది. రష్యన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 ఇప్పటికే రద్దయ్యింది.

అంతర్జాతీయ జూడో సమాఖ్య గౌరవాధ్యక్షునిగా పుతిన్ తన పదవిని పోగొట్టుకున్నారు. రష్యన్ ఫుట్ బాల్, గ్లోబల్ స్పోర్ట్స్ బ్రాండ్ ఆడిడాస్ రష్యన్ ఫుట్ బాట్ ఫెడరేషన్ తో అన్ని రకాల ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. రష్యన్ ఫుట్ బాల్ ఫెడరేషన్ తో తమకున్న అన్నీ సంబంధాలను రద్దు చేసుకుంటున్నట్లు ఆడిడాస్ ప్రకటించటం రష్యాకు పద్ద దెబ్బనే చెప్పాలి. ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణకు నిరసనగా క్రీడా ప్రపంచం మొత్తం రష్యాపై మండిపతోంది. చివరకు ఇది ఎక్కడదాకా వెళుతుందో చూడాలి.