ఇద్దరితో ప్రేమ.. లాటరీ తీసి ఒకరితో పెళ్లి..!

ఓ యువకుడు ఒకేసారి ఇద్దరిని ప్రేమలో దింపాడు. అయితే.. పెళ్లి విషయానికి వచ్చేసరికి ఎవరికి పెళ్లాడాలో మాత్రం అర్థం కాలేదు. దీంతో.. ఆ యువకుడికి గ్రామస్థులే పరిష్కారం చూపించారు. ఆ ఇద్దరు అమ్మాయిల పేరుతో చీటి రాసి.. లాటరీ తీసి.. పెళ్లి చేశారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం హాజన జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హాసన జిల్లా సకలేశపుర సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన ఇద్దరినీ సోషల్ మీడియా లో పరిచయం చేసుకుంది ప్రేమించాడు. ఆ యువతులు కూడా అతడిని గాఢంగా ప్రేమించారు.

అయితే ఇద్దరు యువతులు కూడా తమను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ఇద్దరిలో ఓ యువతి విషం తాగింది. చివరికి ఈ విషయం పై గ్రామంలో పంచాయితీ జరిగింది. దాంతో పెద్దలు చీటీలు వేసి ఎవరి పేరు వస్తే వారిని పెళ్లి చేసుకోవాలని తీర్పు ఇచ్చారు. చీటీ తీయగా అందులో విషం తాగిన యువతి పేరు వచ్చింది. దాంతో మరో యువతి యువకుడి చెంపలు వాయించి నన్ను మోసం చేశావ్..నిన్ను వదలను అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ తరవాత పెద్దల సమక్షం లో యువకుడి పెళ్లి జరిగింది.