ఒకప్పుడు.. భర్త చనిపోతే.. అతని చితిలోనే బలవంతంగానైనా భార్యను కూర్చోపెట్టి దహనం చేసేవారు. దానిని సతీ సహగమనం అనేవారు. ఆ తర్వాత కాల క్రమేనా ఆ మూఢ నమ్మకాన్ని అందరూ వదిలేశారు. అయితే.. తాజాగా అలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అయితే.. కొంచెం రివర్స్. ఇక్కడ చనిపోయింది భర్త కాదు.. భార్య. తనకు భార్య పై ఉన్న అమితమైన ప్రేమను ఆ వ్యక్తి ఇలా ప్రాణార్పణం చేసి అందరికీ చాటిచెప్పాడు. భార్య చితిలో తాను కూడా దూకేశాడు. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
శైలు జోడి గ్రామానికి చెందిన రాయబారి (60), నీలమణి శబర (65) ఇద్దరు భార్యా భర్తలు. వీరికి నలుగురు కుమారులు కూడా ఉన్నారు. రాయబారి మంగళ వారం రోజున గుండె పోటు తో మరణించింది. దీంతో అంత్య క్రియల కోసం మృతి దేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ చితి పేర్చి మృత దేహానికి నిప్పు అంటించారు. అనంతరం అందరూ ఇళ్లకు బయలు దేరారు.
అందరితో పాటే ఇంటికి బయలు దేరిన నీలమణి ఆ తర్వాత… ఒక్క ఉదుటున వెనక్కి పరిగెత్తు కొచ్చి భార్య చితి మంటలలో దూకేశాడు. అందరూ చూస్తుండగానే.. అతడు భార్య తో సహా దహనమయ్యాడు. ఇప్పుడు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. భార్య లేకుండా బతకలేనని భావించే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates