గత సంవత్సరకాలంగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఈ మహమ్మారి ఎప్పుడు వదులుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ మహమ్మారి మాత్రం కొత్త కొత్త వేరియంట్లు మార్చుకొని మరీ.. ప్రజలపై ఎటాక్ చేస్తోంది. ఈ కరోనా వైరస్ కేసుల్లో అత్యంత ప్రమాదకరమైన మ్యూటెంట్ గా నిపుణులు డెల్టా మ్యూటెంట్ ను గుర్తించారు.
ఇప్పటికే మన దేశంలో సెకండ్ వేవ్ సమయంలో ఈ మ్యూటెంట్ అధికంగా వ్యాప్తి చెందిన సంగతి తెలిసిందే. దీనివల్ల కేసుల సంఖ్య వేగంగా పెరగటంతో పాటు మరణాలు కూడా ఎక్కువగా సంభవించాయి. ఈ వేరియంట్ కు వ్యాక్సిన్ నుండి తప్పించుకునే గుణం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు డెల్టా వేరియంట్ గురించి సంచలన విషయాలు భయటపెట్టారు.
ఇతర వేరియంట్ లు సోకిన దానికంటే డెల్టా వేరియంట్ బారిన పడితే వైరస్ లోడ్ 300 రెట్లు అధికంగా ఉన్నట్టు నిర్దారించారు. దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. డెల్టా వేరియంట్ సోకిన వారిపై మరియు ఇతర వేరియంట్ ల బారిన పడిన వారిపై పరిశోధనలు జరపగా డెల్టా వేరియంట్ బారిన పడ్డ వారిలో కరోనా వైరస్ లోడ్ 300 రెట్లు అధికంగా ఉందని నిర్ధారించారు. ఇక ప్రస్తుతం ఈ వేరియంట్ ప్రపంచంలోని కొన్ని దేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates