అత్తకు బాయ్ ఫ్రెండ్ కోసం.. కోడలి ప్రకటన..!

అత్తా, కోడళ్లు ఒకరిపై ఒకరు కారాలు, మిరియాలు నూరడం.. ఒకరిని మరొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం లాంటి సంఘటనలు మనం చాలానే చూశాం. ఒకరి క్షేమం కోసం మరొకరు తప్పించే అత్తా, కోడళ్లను కూడా చూసే ఉంటారు. కానీ.. ఈ అత్తా, కోడళ్లు మాత్రం అలా కాదు. వీరు చాలా డిఫరెంట్.

భర్తను కోల్పోయిన తన అత్త కోసం అద్దెకు బాయ్ ఫ్రెండ్ కావాలంటూ ఓ కోడలు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు ఆమె ఏకంగా.. సోషల్ మీడియాలో ప్రకటన కూడా ఇవ్వడం గమనార్హం. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అమెరికాలోని న్యూయార్క్కు చెందిన ఓ కోడలు.. తన అత్తకు 40-60 ఏళ్ల మధ్య వయస్సున్న వారు రెండు రోజుల పాటు బాయ్ ఫ్రెండ్గా అద్దెకు కావాలని క్రెయిగ్స్లిస్ట్ అనే క్లాసిఫైడ్స్ వెబ్సైట్లో ప్రకటన ఇచ్చింది. అది కాస్తా కొద్ది సమయంలోనే విపరీతంగా వైరల్ అయ్యింది.

51 ఏళ్ల అత్తయ్యతో కాస్తా సమయం గడిపి, వారితో పాటు ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆ వ్యక్తి తోడుగా కావాలట. అందుకోసం 960 డాలర్లు (రూ.72వేలు) ఇస్తానని తెలిపింది.అయితే అతడికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు బాగా డాన్స్ కూడా వచ్చి ఉండాలని షరతు విధించింది కోడలు.

భర్త దూరమై ఒంటరిగా ఉంటున్న తన అత్త.. ఫంక్షన్ లో తోడు లేకుండా ఉండటం ఇష్టం లేని కోడలు.. ఇలా అద్దెకు బాయ్ ఫ్రెండ్ కావాలంటూ ప్రకటించడం గమనార్హం. కాగా.. ఆమె ప్రకటన విని చాలా మంది షాకయ్యారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తుండటం గమనార్హం.