ఫేస్ బుక్ కొత్త రూల్స్..!

Facebook

ప్రముఖ సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ఉన్న కంటెంట్స్ పై ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా యాప్ ఫేస్ బుక్ చ‌ర్య‌ల‌కు రెడీ అయ్యింది. ఈ ఏడాది మే 15 నుండి జూన్ 15 మ‌ధ్య నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ఉన్న మూడు కోట్ల కంటెంట్స్ పై చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు తెలిపింది.

ఈ మూడు కోట్ల‌లో కొన్నింటిని తొల‌గించ‌గా… మ‌రికొన్నింటిని క‌వ‌ర్ చేశామ‌ని చెప్తూ కొత్త రూల్స్ ప్ర‌కారం మొద‌టి నెల నివేదిక‌ను ఎఫ్.బీ విడుద‌ల చేసింది.ఫేస్ బుక్ చ‌ర్య‌లు తీసుకున్న వాటిలో ఎక్కువ‌గా న‌కిలీ కంటెంట్ ఉన్న‌ట్లు గుర్తించారు. 2.5కోట్ల స్పామ్ కంటెంట్, 25ల‌క్ష‌ల హింస‌ను ప్రేరేపించే విష‌యాలు, కొన్ని న‌గ్న చిత్రాలు కూడా ఉన్న‌ట్లు గుర్తించారు.

ఆత్మ‌హ‌త్య‌ల‌ను ప్రేరేపించేలా 5.8ల‌క్ష‌ల కంటెంట్స్ కూడా తొల‌గించిన‌ట్లు ఫేస్ బుక్ ప్ర‌క‌టించింది. ఫేస్ బుక్ కే చెందిన ఇన్ స్టా గ్రామ్ లో 20ల‌క్ష‌ల కంటెంట్స్ ను తొల‌గించారు. అయితే, ఇది మ‌ధ్యంత‌ర నివేదిక మాత్ర‌మేన‌ని… పూర్తిస్థాయి నివేదిక‌ను ఈనెల 18న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు కంపెనీ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి.

యూజ‌ర్స్ త‌మ అభిప్రాయాల‌ను స్వేచ్ఛ‌గా చెప్పుకునే అవ‌కాశం ఉంద‌ని… అయితే యూజ‌ర్స్ కంటెంట్ల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు త‌మ ఆర్టిఫిషియ‌ల్ ఇంటలిజెన్స్ టీంతో పాటు మ‌రో ప్ర‌త్యేక బృందం కూడా ఉంద‌ని కంపెనీ ప్ర‌క‌టించింది.