చైనా వ్యాక్సిన్ మరీ ఇంత అన్యాయమా ?

కరోనా వైరస్ ను ఎదుర్కోవటంలో కొన్ని దేశాలు టీకాలను ఉత్పత్తి చేస్తున్నాయి. అమెరికా, ఇండియా, ఇంగ్లాండ్, రష్యా దేశాలతో పాటు చైనా కూడా వ్యాక్సిన్ ఉత్పత్తిలో పోటీపడుతోంది. అంతా బాగానే ఉంది కానీ చైనా ఉత్పత్తి చేసిన టీకాలను వేసుకున్న వాళ్ళల్లో కరోనా వైరస్ మహమ్మారి మళ్ళీ వస్తోందనే ప్రచారం పెరిగిపోతోంది.

నిజానికి టీకా వేసుకున్నంత మాత్రాన కరోనా సోకదని ఏమిలేదు. అయితే తీవ్రత బాగా తగ్గిపోతుందని మాత్రమే నిపుణులు చెబుతున్నారు. రష్యా తయారీ టీకా స్పుత్నిక్, భారత్ తయారీ కోవ్యాగ్జిన్, కోవీషీల్డ్, అమెరికా తయారీ ఫైజర్, మోడెర్నా టీకాలు వేసుకున్న వాళ్ళకు కూడా కరోనా సోకినా వాళ్ళపై దాని ప్రభావం నామమాత్రంగానే ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అదే చైనా తయారుచేసిన టీకాలు వేసుకున్న వాళ్ళలో కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

పనితీరు, నాణ్యత తదితర అంశాల్లో అనుమానం కారణంగానే చైనా ఉత్పత్తి చేసిన సైనోఫార్మ్, సైనో వాక్ టీకాలు కొనటానికి చాలా దేశాలు వెనకాడాయి. అయితే మంగోలియా, చిలీ, సెషల్స్, బహ్రెయిన్ లాంటి 90 దేశాలు మాత్రం అవసరార్ధం చైనా టీకాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేశాయట. తమ దేశాల్లో చైనా టీకాలతోనే వ్యాక్సినేషన్ ప్రోగ్రాములను నిర్వహిస్తున్నాయి. అయితే టీకాలు వేసుకున్న వాళ్ళల్లో కూడా కరోనా వైరస్ తన ప్రభావాన్ని తీవ్రంగానే చూపుతోందని పై దేశాల్లోని వైద్య నిపుణులు, ఆసుపత్రుల్లో ఆసుపత్రుల్లో ఆందోళన పెరిగిపోతోంది.

అంటే చైనా టీకాలు వేసుకున్నా ఎలాంటి ఉపయోగం కబడటం లేదని పై దేశాల్లో నిర్వహించిన అద్యయనంలో స్పష్టమవుతోంది. దీంతో పై దేశాల్లోని అధ్యయనం ఫలితాలు చూసిన తర్వాత ఇప్పటికే టీకాల కోసం చైనాకు ఆర్డర్లు ఇచ్చిన దేశాలు వాటిని రద్దు చేసుకోవటానికి రెడీ అయిపోతున్నట్లు సమాచారం. మొత్తానికి టీకాల ఉత్పత్తికి సంబంధించి చైనా టీకాల మీద మాత్రమే నెగిటివ్ ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మరి దీనిపై డ్రాగన్ ఏమంటుందో చూడాలి.