మీసం మెలేసిన ధోనీ.. లుక్ అదుర్స్..!

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కి క్రేజ్ చాలా ఎక్కువ. ఆయన ఏది చేసినా.. అభిమానులకు విపరీతంగా నచ్చేస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన ఆయన.. ఐపీఎల్ లో మాత్రమే కనిపించాడు. ఆ ఐపీఎల్ కూడా..కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో.. ధోనీ తాత్కాలికంగా క్రికెట్ కి దూరమయ్యాడు.

ఈ నేపథ్యంలో.. అభిమానులను ఖుషీ చేయడానికి ధోనీ తాజాగా.. తన ఫోటోలను విడుదల చేశాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో సమయం కేటాయిస్తున్న ధోనీ.. తాజాగా.. తన కూతురు జీవాతో కలిసి సిమ్లా టూర్ కి వెళ్లారు. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఆ ఫోటోలో ధోనీ మీసం తిప్పి కనిపించడం గమనార్హం. ఈ ఫోటోలు చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ధోనీ లుక్ అదిరిపోయిందటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ ఫోటోని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కూడా సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

తమిళ సూపర్ స్టార్ అజిత్.. కూతురు సెంటిమెంట్ తో నటించిన జగమల్ల సినిమాలోని కన్నానే కన్నే సినిమాలోని పాటను ఈ ఫోటోకి క్యాప్షన్ గా పెట్టడం గమనార్హం. ఇక కొందరైతే విక్రమార్కుడు లో రవితేజ లా ఉన్నాడంటూ కామెంట్స్ చేయడం గమనార్హం. ధోనీ మైదానంలో కనపడకున్నా.. ఇలా ఫోటోలు షేర్ చేసినందుకు అభిమానులు ఆనంద పడుతున్నారు.