కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి. కాగా.. ఆ మాస్క్ ధరించలేదనే కారణం చూపి.. ఓ వివాహితపై పోలీసు అధికారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గుజరాత్ లోని సూరత్ లో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే… సూరత్ లో ఓ వివాహితపై మాస్క్ పెట్టుకోలేదని ఏకంగా సంవత్సరం పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. గతేడాది లాక్డౌన్ సమయంలో మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వివాహితను.. కేసు పెడతానని బ్లాక్ మెయిల్ చేసి తొలిసారి అత్యాచారం జరిపాడు అ అధికారి. అయితే అదే సమయంలో ఆమె నగ్న చిత్రాలను తీసుకుని.. తరచూ వేధిస్తున్నాడు. ఎవరికైనా చెప్తే వాటిని బయటపెడతానని బెదిరిస్తూ.. అలా ఏడాది కాలంగా ఆమెను లైంగికంగా వేధిస్తూ వస్తున్నాడు.
చివరికి అతని ఆగడాలు భరించలేక తాజాగా పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. మాస్క్ ధరించలేదన్న కారణాన్ని సాకుగా చేసుకుని తనపై అత్యాచారం జరిపాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన ఫోటోలను తీసుకుని ఇప్పటికీ చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటన ఇప్పుడు గుజరాత్లో పెను దుమారం రేపుతోంది. మహిళను రక్షించాల్సిన పోలీసులే.. కీచకులుగా మారిపోవడం ఏమిటంటూ ప్రజా, మహిళా సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.