28 మంది భార్యలు,37వ పెళ్లి..!

ప్రపంచంలో కెల్లా అత్యంత ధైర్యవంతుడు.. ఎవరు అంటే.. మీరు ఎవరి పేరు చెబుతారు..? ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మని అడిగితే మాత్రం.. దుబాయికి చెందిన ఓ ముసలాయను చూపిస్తున్నాడు. అంత ధైర్యవంతమైన పని ఆయన ఏం చేశాడో తెలుసా..? 37వ సారి పెళ్లి చేసుకున్నాడు. అది కూడా తన 28 మంది భార్యలు చూస్తుండగానే. అంతే కదా.. భార్య కళ్ల ముందు మరో అమ్మాయిని చూస్తూనే ఊరు కోరు అలాంటిది.. ఇతను ఏకంగా ఇన్ని పెళ్లిళ్లు చేసుకోవడం అంటే సాహసమే.

ఇంతకీ మ్యాటరేంటంటే…

దుబాయికి చెందిన ఓ వ్యక్తి 37 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అది కూడా 28మంది భార్యల మధ్యలో వారిని పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఈ వివాహ కార్యక్రమంలో అతడి 135 మంది పిల్లలు, 126 మనవళ్లు, మనవరాళ్లు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన 45 సెకన్ల నిడివి కలిగిన ఓ వీడియోను ఐపీఎస్‌ అధికారి రూపిన్‌ శర్మ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఒక్క పెళ్లి చేసుకుందామంటేనే పిల్ల దొరకడం లేదు అంతమంది నీకు ఎలా దొరికారాని కొందరు అంటే.. భార్యలతో ఆయన ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడని ఓ యూజర్ వ్యాఖ్యానించాడు. ఒక్క పెళ్లాంతోనే వేగలేకపోతున్నాం.. ఇంత మందిని ఎలా భరిస్తున్నావు స్వామీ అంటూ కొందరు కామెంట్స్ పెట్టడం గమనార్హం. అసలు అంతమందిని ఆయనను పెళ్లి చేసుకోవడానికి ఎలా అంగీకరించారంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)