కూతుర్ని వేధిస్తున్నాడని.. బైక్ మీద వెళుతూ గొంతు కోసేశాడు

హైదరాబాద్ పాతబస్తీలో తాజాగా చోటు చేసుకున్న ఒక హత్య షాకింగ్ గా మారింది.ప్రేమ పేరుతో తన కుమార్తెను వేధిస్తున్న వాడిని.. కిరాతకంగా హత్య చేసిన వైనం సంచలనంగా మారింది. సీపీ కెమేరా ఫుటేజ్ తో నిందితుడ్ని గుర్తించిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకోవటం కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఇంతకూ జరిగిందేమంటే?

పాతబస్తీకి చెందిన అన్వర్ కు ఒక కుమార్తె ఉంది. ఆమెను ప్రేమ పేరుతో షారుఫ్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించేవాడు. దీంతో.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అతన్ని అరెస్టు చేశారు. పోస్కోకేసు బుక్ చేశారు. అయినప్పటికి తన పద్దతని మార్చుకోని షారుఫ్.. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టేవాడు. తానెంత చెప్పినా వినకుండా.. రివర్సులో వార్నింగ్ లు ఇస్తున్న షారుఫ్ ను చంపేయాలన్న ప్లాన్ వేశాడు అన్వర్.

అందులో భాగంగా కాస్త మాట్లాడాలంటూ షారుఫ్ కు కబురు పంపాడు. నమ్మి వచ్చిన అతనితో.. కాస్త పని ఉంది.. శాలిబండ వరకు వెళ్లేందుకు సాయంగా వస్తావా? అని అడిగాడు. అతని మాటల్ని నమ్మి.. తన బైక్ మీద వెనుక కూర్చోబెట్టుకున్నాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రారం ఫలక్ నుమా బస్ డిపో వద్దకు రాగానే.. తన ముందున్న ఫారుఫ్ గొంతు కోసేశాడు. బైక్ నడుపుతున్న ఫారుఫ్ కు విషయం అర్థమై..గొంతును బలంగా పట్టుకొని రోడ్డు మీద పరుగులు తీశాడు. కాస్త దూరం పరుగెత్తి..కుప్పకూలిపోయాడు. సీసీ కెమేరాను పరిశీలించిన పోలీసులకు.. బైక్ వెనుక కూర్చొని ఉన్న అన్వరే గొంతు కోసిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు.