కరోనా జయించామని జబ్బలు చరుచుకున్నంతసేపు పట్టలేదు.. ఆ ఆనందం ఆవిరి కావటానికి. అసలు.. వడ్డీ మొత్తం కలిపి తీర్చుకున్న చందంగా ఉంది తాజా పరిస్థితి. గత ఏడాది వణికించి.. మన దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసిన కరోనా.. ఇప్పుడు మరోసారి విరుచుకుపడుతోంది. మొదటి దశకు మించిన వేగంతో రెండో దశలో విరుచుకుపడుతున్న ఈ మహమ్మారి.. చెత్త రికార్డుల్ని మన పేరుతో రాసేస్తుంది.
కేవలం వారం వ్యవధిలో తొమ్మిది లక్షలకు పైనే కరోనా కేసుల్ని నమోదు చేయటం.. తాజాగా రోజుకు లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతున్న తీరుతో వణుకు పుట్టే పరిస్థితి. మార్చి మొదటి వారం వరకు కొత్త కేసుల నమోదు మామూలుగా ఉన్నా.. ఆ తర్వాత నుంచి రాకెట్ స్పీడ్ తో నమోదవుతున్నాయి. ఏప్రిల్ ఐదు నుంచి పదకొండు మధ్యనున్న ఏడు రోజుల్లో దేశ వ్యాప్తంగా 9.38లక్షల కేసులు నమోదయ్యాయంటే వైరస్ వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉందన్నది అర్థం చేసుకోవచ్చు. అంతకు ముందు వారంతో పోలిస్తే.. గత వారం కేసుల సంఖ్య 70 శాతం పెరిగింది.
అంతదాకా ఎందుకు.. ఆదివారం ఒక్క రోజులో లక్షన్నర కేసులు నమోదైతే.. ఈ రోజు (సోమవారం) రోజులో నమోదైన కొత్త కేసులు ఏకంగా 1.69 లక్షలు. అంటే.. రోజు తిరిగేసరికి 19వేల కేసులు ఎక్కువగా నమోదు కావటం అంటే మాటలు కాదు. తాజా గణాంకాలు చూస్తే.. ప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యే ప్రతి ఆరు కరోనా కేసుల్లో ఒక కేసు మనదే కావటం గమనార్హం. ఇదంతా చూస్తే.. ఇప్పటికైనా కళ్లు తెరిచి మరిన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే.. రానున్న రోజుల్లో ఇలాంటి చెత్త రికార్దులు మరిన్ని మన పేరుతో నమోదు కావటం ఖాయమని చెప్పక తప్పదు.
This post was last modified on April 12, 2021 10:18 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…